Share News

దత్తత గ్రామంలో తమ్మినేనికి షాక్‌

ABN , Publish Date - May 03 , 2024 | 11:47 PM

మండలంలోని కొండవలస, పెద్దపాలెం, రావివలస, పెద్ద వెంకటాపురం, వీరమల్లిపేట, సింధువాడ, పెద్దసవలాపురం, కొత్తకోట, షలంత్రి, రొట్టవలస గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారామ్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, తన దత్తత గ్రామమైన వీరమల్లిపేటలో ప్రజ లు ఆయనకు షాకిచ్చారు. ఆయన తన చైతన్య రథంపై గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు ఎవరూ అక్కడకు వెళ్లలేదు. ఇటీవల ఈ గ్రామ ప్రజలంతా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నికల ప్రచారానికి వారంతా దూరంగా ఉన్నారు. దీంతో సీతారాం ఆక్రోశం వెల్లగక్కారు. వీరమల్లిపేట గ్రామా న్ని తాను దత్తత తీసుకొని అక్కినేని నాగేశ్వరరావును ఇక్కడకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి మోడల్‌ విలేజ్‌గా రూపొందించానని చెప్పారు. ఎవరో చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది పద్ధతి కాదని ఆవేశం గా అన్నారు. వైసీపీని అభిమానించే వ్యక్తులను కట్టడం చేయడానికి కొంతమంది బెదరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. అలా జరిగితే తాటతీస్తా నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ శివా నందమూర్తి మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరైనా తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి అభివృద్ధి కోసం తన ఆస్తులు అమ్మాయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆవేశభరితంగా ప్రక టించారు. అయినప్పటికీ కూడా గ్రామస్థులు ఎవరు కూడా వైసీపీ ప్రచారం వద్దకు వెళ్లలేదు. దీంతో గ్రామస్థుల ఐకమత్యంపై అంతా చర్చించుకున్నారు.

దత్తత గ్రామంలో తమ్మినేనికి షాక్‌

సరుబుజ్జిలి: మండలంలోని కొండవలస, పెద్దపాలెం, రావివలస, పెద్ద వెంకటాపురం, వీరమల్లిపేట, సింధువాడ, పెద్దసవలాపురం, కొత్తకోట, షలంత్రి, రొట్టవలస గ్రామాల్లో వైసీపీ అభ్యర్థి తమ్మినేని సీతారామ్‌ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే, తన దత్తత గ్రామమైన వీరమల్లిపేటలో ప్రజ లు ఆయనకు షాకిచ్చారు. ఆయన తన చైతన్య రథంపై గ్రామానికి చేరుకోగా గ్రామస్థులు ఎవరూ అక్కడకు వెళ్లలేదు. ఇటీవల ఈ గ్రామ ప్రజలంతా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నికల ప్రచారానికి వారంతా దూరంగా ఉన్నారు. దీంతో సీతారాం ఆక్రోశం వెల్లగక్కారు. వీరమల్లిపేట గ్రామా న్ని తాను దత్తత తీసుకొని అక్కినేని నాగేశ్వరరావును ఇక్కడకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేసి మోడల్‌ విలేజ్‌గా రూపొందించానని చెప్పారు. ఎవరో చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం మంచిది పద్ధతి కాదని ఆవేశం గా అన్నారు. వైసీపీని అభిమానించే వ్యక్తులను కట్టడం చేయడానికి కొంతమంది బెదరింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదన్నారు. అలా జరిగితే తాటతీస్తా నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందిన వైస్‌ ఎంపీపీ శివా నందమూర్తి మాట్లాడుతూ.. తాను ఏ తప్పు చేయలేదని, ఎవరైనా తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ముక్కు నేలకు రాసి అభివృద్ధి కోసం తన ఆస్తులు అమ్మాయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆవేశభరితంగా ప్రక టించారు. అయినప్పటికీ కూడా గ్రామస్థులు ఎవరు కూడా వైసీపీ ప్రచారం వద్దకు వెళ్లలేదు. దీంతో గ్రామస్థుల ఐకమత్యంపై అంతా చర్చించుకున్నారు.

Updated Date - May 03 , 2024 | 11:47 PM