Share News

సంపదను పెంచుతాం.. ప్రజలకు పంచుతాం

ABN , Publish Date - May 04 , 2024 | 11:35 PM

తింటూ కూర్చుంటే కొండలయినా తరుగుతాయి. అప్పులపాలవుతాం. అలా కాకుండా వనరులను ఉపయోగించుకుని సంపదను సృష్టిస్తాం. దాన్ని ప్రజలకు పం చుతాం. ఇదే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కూటమి పార్టీల నినాదం. అభివృద్ధి, సం క్షేమం, ఉపాధితో రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరు పునరింకతం కావాలని అందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌కు సైకిల్‌ గుర్తులుపై ఓట్లువేసి గెలిపించాలని టీడీపీ కూటమి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య పిలుపునిచ్చారు.

సంపదను పెంచుతాం.. ప్రజలకు పంచుతాం
వాడరేవు మత్స్యకారులను పార్టీలోకి ఆహ్వానిస్తున్న కొండయ్య

టీడీపీ కూటమి కొండయ్య

చీరాల, మే 4 : తింటూ కూర్చుంటే కొండలయినా తరుగుతాయి. అప్పులపాలవుతాం. అలా కాకుండా వనరులను ఉపయోగించుకుని సంపదను సృష్టిస్తాం. దాన్ని ప్రజలకు పం చుతాం. ఇదే టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, కూటమి పార్టీల నినాదం. అభివృద్ధి, సం క్షేమం, ఉపాధితో రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరు పునరింకతం కావాలని అందుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా తెన్నేటి కృష్ణప్రసాద్‌కు సైకిల్‌ గుర్తులుపై ఓట్లువేసి గెలిపించాలని టీడీపీ కూటమి అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి నాయకులు, కా ర్యకర్తలతో కలసి ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో శనివారం చీరాల ఐటీసీ కార్మికులను కొండయ్య కలిశారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు ము ఖ్యమంత్రి అవుతారు. ఆ తరువాత అన్ని సమస్యలనూ ప్రాధాన్యతక్రమంలో పరిష్కరిస్తామని ఆయన వారికి చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలోకి భారీగా చేరికలు

మండల పరిధిలోని వాడరేవుకు చెందిన పలువురు మత్స్యకారులు శనివారం పార్టీ కార్యాలయంలో టీడీపీ కూటమి అభ్యర్థి కొండయ్య సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలువేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మాజీ మంత్రి డాక్టర్‌ పాలేటి ముఖ్య అనుచరుల్లో ఒకరైన పిక్కి నారాయణ, నర్రా బ్రహ్మయ్య, మారుబోయిన ప్రేమ్‌చంద్‌రెడ్డి, వడ్లమూడి సుబ్బారావు, మారుబోయిన ఏడుకొండలరెడ్డి, పిక్కి రాంబాబుల ఆధ్వర్యం లో సుమారు 50 ఆటోలలో వచ్చిన మత్స్యకారులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తాము వైసీపీలో ఉన్నామని, టీడీపీకి మద్దతు తెలుపుతున్నామని చెప్పారు. కొండయ్య మాట్లాడుతూ ఎన్నికలలో వారు అనుసరించాల్సిన విధానాన్ని, కర్తవ్యాలపై దిశానిర్దేశం చేశారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. అధికారంలోకి వచ్చాక అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మహిళలు చైతన్యవంతులు కావాలి

మండల పరిధిలోని ఈపురుపాలెం గాంధీపార్కులో శనివారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మహిళా సదస్సు జరిగింది. డాక్టర్‌ సజ్జా హేమలత ఆధ్వర్యంలో జరిగిన ఈ సదుస్సుకు ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, బాపట్ల పార్లమెంట్‌ ఎంపీ అభ్యర్థి తెన్నేట కృష్ణప్రసాద్‌ సతీమణి శిరీష, కుమార్తె రమ్య, ఎమ్మెల్యే అభ్యర్థి కొం డయ్య కుమార్తె శివనారాయణదేవిలు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతంగా ఆలోచించాలన్నారు. వచ్చే ఎ న్నికలలో సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. లేదంటే రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి మ్యానిఫెస్టోలో పొందు పరిచిన అంశాలు, బీసీ డిక్లరేషన్‌ ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆదరించండి .. అండగా ఉంటా

వచ్చే ఎన్నికల్లో ఆదరించాలని గెలిపించాలని, అన్ని విధాలా అండగా ఉంటానని మాలకొండయ్య అన్నారు. మండల పరిఽధిలోని గవినివారిపాలెంలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టో, బీసీ డిక్లరేషన్‌ ప్రతులను పంచుతూ ఓట్లు అభ్యర్థించారు. ఎమ్మల్యే అభ్యర్థిగా తనకు, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌కు సైకిల్‌ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. గెలిచాక కూ టమి ప్రభుత్వంలో అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:35 PM