Share News

టీడీపీతోనే ‘సంక్షేమం’

ABN , Publish Date - May 04 , 2024 | 11:26 PM

టీడీపీతోనే సంక్షేమ పథకాలు అమలు సాధ్యమని కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భారీగా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు, సీఎస్‌పురం మండలాల నుంచి ఒకేరోజు 87 కుటుంబాలు వైసీపీని వీడి శనివారం డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు.

టీడీపీతోనే ‘సంక్షేమం’
వైసీపిని వీడి డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడిపిలో చేరిన కనిగిరిలోని దేవాంగనగర్‌ వాసులు

- కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి

- వైసీపీని వీడిన 87 కుటుంబాలు

కనిగిరి, మే 4: టీడీపీతోనే సంక్షేమ పథకాలు అమలు సాధ్యమని కూటమి అభ్యర్థి డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి అన్నారు. కనిగిరి నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి భారీగా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో నియోజకవర్గంలోని కనిగిరి, పామూరు, సీఎస్‌పురం మండలాల నుంచి ఒకేరోజు 87 కుటుంబాలు వైసీపీని వీడి శనివారం డాక్టర్‌ ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా డాక్టర్‌ ఉగ్ర మాట్లాడుతూ పార్టీలో నూతనంగా చేరినవారు కూటమి మేనిఫెస్టోపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటంతోనే ప్రజాసంక్షేమం సాధ్యమన్నారు. ప్రజాసంక్షేమం కాంక్షించిన చంద్రబాబు అన్నివర్గాల ప్రజలకు మేలు జరిగేలా పథకాలు మేనిఫెస్టోలో రూపొందించారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలో 50ఏళ్ళు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్‌ అందిస్మాన్నారు. దివ్యాంగులకు రూ6వేలు పింఛన్‌ అందించి వారికి అండగా నిలుస్తారన్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగాలు పొందే వరకు నిరుద్యోగ భృతి కల్పించి వారిలో మనోధైర్యాన్ని నింపనున్నట్టు చెప్పారు. కుల, మతాలకు అతీతంగా టీడీపీని ప్రజలు ఆదరించి అత్యధిక మెజార్టీ కల్పించాలన్నారు.

కనిగిరి పట్టణంలోని దేవాంగనగర్‌ 11వ వార్డుకు చెందిన 27 కుటుంబాలు, మంగలిమాన్యంకు చెందిన 21 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అలాగే, పామూరు మండలంలోని మోపాడు గ్రామానికి చెందిన 8 కుటుంబాలు, వెలిగండ్ల మండలానికి చెందిన పది కుటుంబాలు మాజీ సర్పంచ్‌ చౌడారెడ్డి, పుల్లారెడ్డి, సింగలరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య తదితరులు టీడీపీలో చేరారు. సీఎస్‌పురం మండలంలోని వెంగనగుంట సర్పంచ్‌ మద్దిశెట్టి నరసింహంతోపాటు వాకా సత్యనారాయణ, పిడుగు బాబూరావు ఆధ్వరం్యలో 21 కుటుంబాలు చేరారు. పార్టీలో చేరిన వారికి డాక్టర్‌ ఉగ్ర తాను చేపట్టబోయే అభివృద్ది ప్రణాళికలను వివరించి ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని కోరారు. ఎన్నికలు అతి చేరువలో ఉన్నాయని, ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలన్నారు. కనిగిరిలో అత్యధిక మెజార్టీ సాధిస్తే కనిగిరి ప్రాంతాభివృద్దికి అత్యధికంగా నిదులు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి కోరవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన 25 కుటుంబాలు

పామూరు, మే 4: పామూరు మండలంలోని బోడవాడ గ్రామ పంచాయతి మాజీ సర్పంచ్‌, ప్రముఖ న్యాయవాది విప్పగుంట రామ్మోహన్‌ రావు అధికార వైసీపీని వీడి ఉగ్ర సమక్షంలో శనివారం సాయంత్రం టీడీపీలో చేరారు. ఆయనతోపాటు 25 కుటుంబాలు వైసీపీని వీడారు. వారందరికి టీడీపీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ దాసరి మాలకొండయ్య యాదవ్‌, దొడ్డా కోటిలింగం, రమణయ్య, దాసరి రత్తయ్య, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ అభ్యర్థులను గెలిపించండి

పామూరు, మే 4: సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి మాగుంట, ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డిని గెలిపించాలని ఉగ్ర తనయుడు ముక్కు జయసింహారెడ్డి కోరారు. మండలంలోని కంభాలదిన్నె గ్రామంలో టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా శనివారం సాయంత్రం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు మన్నం రమణయ్య, గోళ్ల వీరబాబు, ఏలూరి నరసింహారావు, పిచ్చాల తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్‌ మాల్యాద్రినాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:27 PM