Share News

పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌లో ప్రణాళికా లోపం

ABN , Publish Date - May 05 , 2024 | 12:31 AM

ఎన్నికల డ్యూటీ పడిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ విని యోగించుకొనే నిమిత్తం సంతనూతలపాడు నియోజకవర్గంకు ఫెసిలిటేషన్‌ సెంట ర్‌ను చీమకుర్తి ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేశారు.

పోస్టల్‌బ్యాలెట్‌ పోలింగ్‌లో ప్రణాళికా లోపం

మూడుగంటల ఆలస్యంగా ప్రారంభం

చీమకుర్తి, మే4 : ఎన్నికల డ్యూటీ పడిన ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ విని యోగించుకొనే నిమిత్తం సంతనూతలపాడు నియోజకవర్గంకు ఫెసిలిటేషన్‌ సెంట ర్‌ను చీమకుర్తి ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేశారు. 4నుంచి 7వ తేదీ వరకూ ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్‌ నిర్వహణకు పో లింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇచ్చిన షెడ్యూల్‌లో స్పష్టత లేకపోవటంతో శని వారం పీవో, ఓపీవో డ్యూటీ పడిన వారు మాత్రమే ఓటింగ్‌కు హజరయ్యారు. వాస్తవంగా నాలుగురోజుల సమయంలో డ్యూటీ పడినవారు ఎవరైనా ఏరోజైనా ఓ టుహక్కును వినియోగించుకోవచ్చు. దీంతో తమ ఓటుహక్కును వినియోగించకోవ టానికి ఉదయం ఏడుగంటలకే ఉద్యోగులు పోలింగ్‌కేంద్రం వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ అధికారులు ఎవరూ లేకపోవటం, అసలు పోలింగ్‌ జ రుగుతుందా లేదా అని సమాధానం చెప్పేవారే కరవయ్యారు. తాపీగా అధికారులు వచ్చినా 10గంటల వరకూ పోలింగ్‌ ప్రారంభం కాకపోవటం అధికారుల ప్రణాళికా లోపం స్పష్టంగా కనపడింది. మొత్తం మీద తొలిరోజు 409 ఓట్లు పోలయ్యాయి. ఆర్వో గోపాలకృష్ణ పోలింగ్‌ తీరును పర్యవేక్షించారు. మిగిలిన మూడురోజులు పో లింగ్‌ 7గంటలకే ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు.

Updated Date - May 05 , 2024 | 12:31 AM