Share News

భూములను దోచేయటానికి జగన్‌రెడ్డి కుట్ర.!

ABN , Publish Date - May 04 , 2024 | 11:53 PM

రాష్ట్రంలో భూములను దోచేయటానికి జగన్‌రెడ్డి కుట్రపన్నారని, అందుకే ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టును తీసుకొచ్చారని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని పాతసింగరాయకొండ, సోమరాజుపల్లి పంచాయతీల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వంశపారపర్యంగా తాతముత్తాతలు ఇచ్చిన ఆస్తుల తాలుకా పాస్‌పుస్తకాలపై జగన్‌రెడ్డి బొమ్మ వేయించుకోని ఆస్తి పత్రాలను జిరాక్స్‌ కాఫీలుగా మార్చడం దుర్మార్గమన్నారు.

భూములను దోచేయటానికి జగన్‌రెడ్డి కుట్ర.!
ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే స్వామి

అందుకే ల్యాండ్‌ టైటిల్‌ యాక్టు తీసుకొచ్చారు

పాతసింగరాయకొండ, సోమరాజుపల్లిలో విస్తృతంగా పర్యటన

కంట్లో బాణసంచా నిప్పురవ్వలు పడి ఇబ్బంది పడ్డ స్వామి

సింగరాయకొండ, మే 4 : రాష్ట్రంలో భూములను దోచేయటానికి జగన్‌రెడ్డి కుట్రపన్నారని, అందుకే ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్టును తీసుకొచ్చారని ఎమ్మెల్యే డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. మండలంలోని పాతసింగరాయకొండ, సోమరాజుపల్లి పంచాయతీల్లో ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ వంశపారపర్యంగా తాతముత్తాతలు ఇచ్చిన ఆస్తుల తాలుకా పాస్‌పుస్తకాలపై జగన్‌రెడ్డి బొమ్మ వేయించుకోని ఆస్తి పత్రాలను జిరాక్స్‌ కాఫీలుగా మార్చడం దుర్మార్గమన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో రైతులకు ఎలాంటి రక్షణ ఉండదని తెలిపారు. ఈసారి జగన్‌ గెలిస్తే ప్రభుత్వ ఆస్తులను, సచివాలయాన్ని తనఖాపెట్టినట్లు రైతుల భూములను కూడా తాకట్టు పెడతారని తెలిపారు. మీకు తెలియకుండానే మీ భూములను అమ్మేస్తారని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండో సంతకం ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ రద్దుపై పెట్టి రైతులకు చంద్రబాబు ఉపశమనం కల్పిస్తారని హామీ ఇచ్చారు. బీజేపీతో పొత్తు వలన ముస్లింలకు అన్యాయం జరుగుతుందని టీడీపీకి ఓట్లేయరని వైసీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014-19 బీజేపీతో పొత్తులో ఉన్న సమయంలోనే టీడీపీ ముస్లింలకు దుల్హాన్‌ , రంజాన్‌తోపా, ఇమాం, మౌజమ్‌లకు గౌరవేతనం, ఈద్గాల అభివృద్ధికి నిఽధులు ఇచ్చామని గుర్తుచేశారు. ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భరోసా కల్పించారు. మోసగాళ్లయిన వైసీపీ నేతల మాయ మాటలు నమ్మొద్దని హితవు పలికారు. అదికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గంలో ముస్లిం విద్యార్థులకు ఉర్దూగురుకుల పాఠశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో పూర్తిగా సీసీ రోడ్లు వేస్తె కనీసం వాటి పక్కన ఒక సైడుకాలువను కూడా నిర్మించలేని అసమర్థ ప్రభుత్వం వైసీపీదన్నారు. అనంతరం సూపర్‌సిక్స్‌ పఽథకాల గురించి వివరించారు. వాటి వలన కలిగే లబ్ధిని క్షుణ్ణంగా ఓటర్లకు వివరించారు. గ్రామాలలో ఆగిపోయిన అభివృద్ధిని కొనసాగించాలంటే ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా మాగుంటను గెలిపించాలని కోరారు.

బహ్మరథం పట్టిన ప్రజలు

పాతసింగరాయకొండ పంచాయతీ పరిధిలోని అయ్యప్పనగర్‌, బాలిరెడ్డినగర్‌, నరసింహనగర్‌, మెయిన్‌ విలేజ్‌, ఎస్సీ కాలనీలు, సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో ఫకీర్‌పాలెం, మెయిన్‌ విలేజ్‌ ఎస్సీకాలనీ, ఆవులవారిపాలెం, నర్రావారిపాలెం ఎమ్మెల్యే స్వామి విస్తృతంగా పర్యటించారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రతిచోట యువత, మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పూలమాలలు వేసి హారతులు పట్టి తప్పెట్లు, మేళతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి కూడా ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమయ్యారు. గ్రామాలలో ప్రజలు చెప్పిన సమస్యలను ఓపిగ్గా విని సమాధానాలు చెప్పారు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రతి సమసనూ పరిష్కారిస్తామని హామీ ఇస్తూ ముందుకు కదిలారు.

ప్రచారంలో అపశ్రుతి

సోమరాజుపల్లి పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే డాక్టర్‌ స్వామి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో షాట్స్‌ పేలుస్తుండగా పైనుంచి నిప్పురవ్వలు ఆయన కంటిలో పడ్డాయి. దీంతో ఆయన తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. సముదాయించుకొని అక్కడికి భారీగా వచ్చిన ప్రజలతో మాట్లాడానికి ప్రయత్నించారు. కానీ కంటికి తీవ్ర గాయం కావడంతో కన్ను తెరవనీయలేదు. దీంతో ప్రచారాన్ని నిలిపివేసి హుటాహుటిన ప్రచారాన్ని నిలిపివేసి ఒంగోలు ఆసుపత్రికి వెళ్లారు. వైద్యం చేయించుకొని తూర్పునాయుడుపాలెంలో స్వగృహానికి చేరుకున్నారు. ప్రమాద విషయాన్ని తెలుసుకొని నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున వారి గృహానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదం ఏమీలేదని చెప్పడంతో టీడీపీ కేడర్‌ కుదుటపడింది.

Updated Date - May 04 , 2024 | 11:53 PM