Share News

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం

ABN , Publish Date - May 04 , 2024 | 11:31 PM

పర్చూరు నియోజకవర్గానికి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ 2014 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా ఏలూరి ఎన్నికయ్యారు. పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించి, ఎంతో మందికి సంక్షేమ ఫలాలు అందించిన సాంబన్నకు మా మద్దతు అని మార్టూరు బలరాం కాలనీకి చెందిన ముదిరాజులు, యాదవులు, కాపులు, అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఎస్పీ మాదిగలు కారంచేడు గ్రామానికి చెందిన యానాదులు, రజకులు ఏలూరి సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలూరి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యం
ఏలూరికి స్వాగతం పలుకుతున్న మహిళలు

ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి

సాంబన్నకే మా మద్దతంటున్న

కారంచేడు, మార్టూరు బలహీనవర్గాలు

పర్చూరు, మే 4 : పర్చూరు నియోజకవర్గానికి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా పనిచేశారు. కానీ 2014 సాధారణ ఎన్నికల్లో మొట్టమొదటి సారిగా ఎమ్మెల్యేగా ఏలూరి ఎన్నికయ్యారు. పర్చూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడిపించి, ఎంతో మందికి సంక్షేమ ఫలాలు అందించిన సాంబన్నకు మా మద్దతు అని మార్టూరు బలరాం కాలనీకి చెందిన ముదిరాజులు, యాదవులు, కాపులు, అంబేడ్కర్‌ కాలనీకి చెందిన ఎస్పీ మాదిగలు కారంచేడు గ్రామానికి చెందిన యానాదులు, రజకులు ఏలూరి సమక్షంలో శనివారం పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే ఏలూరి కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి చేసి చూపించిన ప్రభుత్వం తెలుగుదేశం మాత్రమేనన్నారు. ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేని రాష్ట్రంగా చేసిందన్నారు. అభివృద్ధిలో ఏపీని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన చేతగాని వ్యక్తి జగన్‌ అన్నారు. కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 13న జరిగే ఎన్నికలో సైకిల్‌ గుర్తు బటన్‌పై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి, జగన్‌ పాలన నుంచి విముక్తి చేయాలన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేస్తారన్నారు.

మార్టూరు బలరాం కాలనీకి చెందిన బోడంగుంట్ల కల్యాణ్‌, వల్లభనేని రాజేష్‌, చల్లా ఆదినారాయణ, బెజ్జల నాగశివశంకర్‌, మేకల పూర్ణ, నరసింహారావు, ఉప్పుటూరి పోతురాజు. అదేవిధంగా మార్టూరులోని అంబేద్కర్‌ కాలనీకి చెందిన మురికిపూడి రవి, అట్లూరి ప్రసాద్‌, మురికిపూడి కిరణ్‌, కిన్నెర కిరణ్‌, పోలిపోగు దేవదానం, కమ్మంపాటి ఏసోబు, పల్లెపోగు ఇజ్రాయెల్‌, మురళి పార్టీలో చేరారు.

కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామానికి చెందిన మైనార్టీ నాయకులు షేక్‌ జిలానీ, అదేవిధంగా యర్రంవారిపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు బత్తుల శ్రీనివాసరెడ్డి, యర్రం శ్రీనివాసరెడ్డి పార్టీలోకి చేరారు.

పరదాల చాటున పాలన : ఏలూరి

దేశ చరిత్రలో పరదాల చాటున పాలించే వ్యక్తి జగన్‌రెడ్డి ఒక్కరేనని, ఇది ఏపీకి మాయని మచ్చని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు. శనివారం ఎన్నికల శంకారావంలో భాగంగా కారంచేడు మండలం కేశవరప్పాడు, కొడవలివారిపాలెం, స్వర్ణ, స్వర్ణపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఏలూరి మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి ఏకంగా రైతుల భూములు కబ్జా చేసేందుకు ల్యాండ్‌ టైటిల్‌ చట్టాన్ని తెచ్చారన్నారు. దీంతో మన భూమిని ఎవరైనా లాగేసుకోవచ్చన్నారు. టీడీపీ కూటమి రాగానే ఆ కుట్ర పూరిత చట్టాన్ని రద్దు చేస్తామని ఏలూరి స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని పథకాలను అమలు చేస్తామన్నారు. ఈ సందర్భంగా మహిళా శక్తి పథకాలను ఒకొక్కటిగా ఏలూరి వివరించారు. పేదలను ఆర్థిక ఇబ్బందులు లేకుండా పాలించడమే చంద్రబాబు ధ్యేయమన్నారు. అన్నివర్గాల ప్రజలు విధ్వంస పాలకుడు జగన్‌ను గద్దె దింపి, అభివృద్ధి ప్రదాత చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ఏలూరి విజ్ఞప్తి చేశారు. అనంతరం జనసేన నియోజకవర్గ కార్యదర్శి పెద్దపూడి విజేయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రజల మనిషి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ఏలూరి సాంబశివరావును అఖండ మెజార్జీతో గెలిపించాలని కోరారు.

అడుగడుగునా నీరాజనం

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరికి శనివారం కారంచేడు ప్రజలు నీరాజనాలు పలికారు. ప్రచారంలో ఆయనకు అడుగడుగునా బ్రహ్మరథం ప ట్టారు. ఏలూరికి మహిళలు హారతులిస్తూ ఘనస్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, యువకులు తరలివచ్చి ఏలూరికి జైకొట్టారు. అనంతరం కరప త్రాలను పంచుతూ సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కృష్ణ ప్రసాద్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రేణులు పాల్గొన్నారు.

వైసీపీ ప్రచారాన్ని నమ్మొద్దు

టీడీపీతోనే ముస్లింలకు రక్షణ, సంక్షేమం : ఏలూరి

ఇంకొల్లు : ముస్లిం మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మైనారిటీలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత తనదేనని టీడీపీ కూటమి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు భరోసా ఇచ్చారు. శనివారం ఏలూరి క్యాంప్‌ కార్యాలయంలో మీట్‌ విత్‌ ఏలూరితో ఇంకొల్లుకు చెం దిన ముస్లిం మైనారిటీలు సమావేశమ్యారు. ఈ సందర్భంగా ఏలూరి మాట్లాడు తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల 4శాతం రిజర్వేషన్‌ ఎత్తివేస్తారని, మసీద్‌లు, ఈద్గాలపై దాడులు చేస్తారంటూ వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై మండిపడ్డారు. అలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని, అందరూ ఐ క్యంగా తిప్పికొట్టి కూటమిని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లిం రిజర్వేషన్‌పై ఢిల్లీలో చంద్రబాబు పోరాడిన విషయాన్ని ఏలూరి గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే మసీద్‌లు, శ్మశానవాటికలను అభివృద్ధి చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమలు చేసిన పథకాలను ముస్లింలు గుర్తుంచుకోవాలన్నారు. ఐదేళ్ల జగన్‌రెడ్డి పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఈ సం దర్భంగా పలువురు ముస్లింలు ఏలూరికి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో మైనారిటీ నాయకులు ఎంపీటీసీ సభ్యుడు ఆయోషాబుడే, మస్తాన్‌బాబా, ఆరిఫా, మాబాషా, బాబర్‌, సూరజ్‌, బాబు, బార్‌సైదా, కాజా, సూరజ్‌, జనసేన కార్యకర్తలు ఇంతియాజ్‌, గోపి, కరిముల్లా, పైయాజ్‌, రఫీ పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:31 PM