Share News

చంద్రబాబు సభ సూపర్‌ సక్సెస్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:22 PM

ఎన్నికల ప్రచారంలో బాగంగా శనివారం దర్శిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం ప్రచార యాత్ర సభ సూపర్‌ సక్సెస్‌ అయింది. నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

చంద్రబాబు సభ సూపర్‌ సక్సెస్‌

- వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు

- కిక్కిరిసిన దర్శి పట్టణ వీధులు

- ఉత్సాహంతో కేరింతలు కొట్టిన యువత

దర్శి, మే 4 : ఎన్నికల ప్రచారంలో బాగంగా శనివారం దర్శిలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న ప్రజాగళం ప్రచార యాత్ర సభ సూపర్‌ సక్సెస్‌ అయింది. నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, అభిమానులు వేలాదిమంది ఉత్సాహంగా పాల్గొన్నారు. మండుటెండను సహితం లెక్కచేయకుండా మహిళలు, చిన్నారులు, వృద్ధులు అధికసంఖ్యలో సభకు హాజరుకావటం విశేషం. అన్నీ మండలాల నుంచి స్వచ్ఛందంగా వేలాదిమంది చంద్రబాబు సభకు హాజరుకావటంతో క్యాడర్‌లో ఉత్సాహం ఉప్పొంగింది. అధినేత చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా వినటంతో పాటు కొన్ని సందర్భాల్లో విక్టరీ చూపుతూ కేరింతలు కొట్టారు. వైసీపీ పాలకులను విమర్శించినప్పుడు, సీఎం జగన్‌ అవినీతి అక్రమాల గూర్చి ప్రస్తావించినప్పుడు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది. చంద్రబాబు ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ అవునా, కాదా అంటూ ప్రజల నుంచే సమాదానాలు రాబట్టారు. మండుటెండలో సహితం చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. టీడీపీ సభ విజయవంతం కావటంతో వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించటం ఖాయమని క్యాడర్‌ భావిస్తున్నారు.

పర్యటన సాగింది ఇలా..

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో బాగంగా హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 12.10 నిమిషాలకు హెలిప్యాడ్‌ వద్ద ల్యాండ్‌ అయ్యారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో వాహనంలో దర్శి పట్టణంలోని సభావేధిక వద్దకు 3 కిలోమీటర్లు ప్రత్యేక వాహనంలో వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు సభ ప్రారంభమైంది. ముందుగా దర్శి అసెంబ్లీ టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, అనంతరం ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు ఆతర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు 40 నిమిషాలు ప్రసంగించారు. 1.30 గంటలకు సభ ముగిసింది. అనంతరం హెలిప్యాడ్‌ వద్దకు వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక బస్సులో బస చేశారు. అనంతరం ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, దర్శి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, టీడీపీ ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్ధన్‌, గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థి అశోక్‌రెడ్డి తదితరులతో కొద్దిసేపు మాట్లాడారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో చివరి దశలో ముమ్మర ప్రచారం, పోలింగ్‌ తదితర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్టు తెలిసింది అనంతరం 3.10 నిమిషాలకు హెలికాప్టర్‌లో నూజివీడు బయలుదేరి వెళ్లారు.

చంద్రబాబు సభకు భారీగా తరలిన తెలుగుతమ్ముళ్లు

కురిచేడు : దర్శిలో ఏర్పాటుచేసిన చంద్రబాబు సభకు కురిచేడు మండలం నుంచి తెలుగు తమ్ముళ్లు భారీగా తరలివెళ్లారు. ట్రాక్టర్లు, లారీలు, ఆటోలలో నాలుగు వేలమంది వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దర్శికి వెళ్లారు. చంద్రబాబు సభ అనంతరం కార్యకర్తల్లో జోష్‌ కనపడింది. ఈసారి మహిళలు సహితం పెద్దసంఖ్యలో తరలివెళ్లారు.

తాళ్లూరు: చంద్రబాబు దర్శిలో పాల్గొన్న ప్రజాగళం కార్యక్రమానికి తాళ్లూరు మండలం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మండలంలోని అన్ని గ్రామాలనుంచి వాహనాలు, మోటార్‌ సైకిళ్లపై వెళ్లారు. మహిళలు అధిక సంఖ్యలో ట్రాక్టర్లలో సభకు తరలి వెళ్లారు.

ముండ్లమూరు: దర్శి పట్టణంలో చంద్రబాబు సభకు ముండ్లమూరు మండలం నుంచి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిశెల్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి చంద్రబాబు సభకు అన్నివర్గాలకు చెందిన ప్రజలు వెళ్లారు. సభకు అనూహ్య స్పందన రావడంతో టీడీపీ శ్రేణుల్లో జోష్‌ నెలకొంది.

Updated Date - May 04 , 2024 | 11:22 PM