Share News

రాష్ట్ర పునర్‌ నిర్మాణానికే పొత్తు

ABN , Publish Date - May 04 , 2024 | 11:28 PM

రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసమే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అద్దంకి పట్టణంలోని 6వ వార్డులో గొట్టిపాటి ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వస్తే ముస్లింలకు, క్రిస్టియన్లకు రక్షణ ఉండదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. జగన్‌రెడ్డి మాటలను ఎవరూ నమ్మవద్దని కోరారు. అన్నివర్గాల ప్రజలకు రక్షణ, ఆనందకరమైన పాలన టీడీపీ కూ టమితోనే లభిస్తుందన్నారు.

రాష్ట్ర పునర్‌ నిర్మాణానికే పొత్తు
రామ్‌నగర్‌లో టీ దుకాణం వద్ద ప్రచారం చేస్తున్న గొట్టిపాటి

వైసీపీ తప్పుడు ప్రచారాన్ని క్రిస్టియన్లు నమ్మొద్దు

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి

అద్దంకి, మే 4 : రాష్ట్ర పునర్‌నిర్మాణం కోసమే బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకోవడం జరిగిందని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం అద్దంకి పట్టణంలోని 6వ వార్డులో గొట్టిపాటి ఇంటింటికీ తిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వస్తే ముస్లింలకు, క్రిస్టియన్లకు రక్షణ ఉండదని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. జగన్‌రెడ్డి మాటలను ఎవరూ నమ్మవద్దని కోరారు. అన్నివర్గాల ప్రజలకు రక్షణ, ఆనందకరమైన పాలన టీడీపీ కూ టమితోనే లభిస్తుందన్నారు. రాష్ట్రం కోసం, పిల్లల భవిష్యత్‌ కోసం కూటమి అభ్యర్థులను గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. గతంలో బీజేపీతో టీడీపీ ఉన్నప్పు డు క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. చంద్రబాబు పాలనలో క్రిస్మస్‌ కానుకలు, పాస్లర్లకు గౌరవ వేతనం, చర్చిల అభివృద్ధికి నిధులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కులం, మతం అనే భేదాలు లేకుండా ప్రజల శ్రే యస్సే టీడీపీకి ముఖ్యమన్నారు. ఈ విషయంలో చంద్రబాబు ఎక్కడా రాజీపడరని స్పష్టం చేశారు. జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారాలను దళితులు తిప్పికొట్టాలన్నారు. మేనిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. జగన్‌రెడ్డి ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తే పదింతలు లాక్కున్నారన్నారు. అధికారంలోకి రాగానే డ్రైవర్లకు రూ.15వేల సాయం ఇవ్వడంతోపాటు జీవో 21ని రద్దు చేసి, జరి మానాల భారాన్ని తగ్గిస్తామన్నారు. వైసీపీ పెంచిన గ్రీన్‌ట్యాక్స్‌ను తగ్గిస్తా మన్నారు. అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమాతో ఆదుకుంటామ న్నారు. కాపు కార్పొరేషన్‌ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. 5 శాతం రిజర్వేషన్‌లు కాపులకు కేటాయించామన్నారు. జగన్‌రెడ్డి వచ్చాక వాటిని తొలగించారన్నారు. సచివాలయ ఉద్యోగాలలో సుమారు 13వేల ఉద్యోగాలు కాపు యువత కోల్పోయారన్నారు. రాజకీయంగా, విద్యాపరంగా ఆర్థికంగా కాపులు ఎదగడం జగన్‌రెడ్డికి ఇష్టం లేదన్నారు. కౌన్సిలర్‌లు కంపా రజనీ, రంగిశెట్టి సుభాషిణి, అత్తులూరి రమేష్‌, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కుందారపు రామారావు, చిన్ని శ్రీనివాసరావు, మన్నెం ఏడుకొండలు, గోరంట్ల సాయి, న ర్రా వుల కొండలు, పూనూరి నరేంద్ర, హనుమంతరావు, కమ్మిశెట్టి శ్రీధర్‌, చిన్నా, హజరత్తయ్య, చీమలదిన్నె రమణయ్య పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:28 PM