Share News

‘సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి’

ABN , Publish Date - May 04 , 2024 | 11:37 PM

నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గా నికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు తెలిపారు.

‘సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి’
మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీనివాసులు

నంద్యాల (కల్చరల్‌), మే 4: నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గా నికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి డా.కె. శ్రీనివాసులు తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆళ్లగడ్డ నియోజక వర్గంలో 354, శ్రీశైలంలో 271, నందికొట్కూర్‌లో 301, నంద్యాలలో 351, బనగానపల్లెలో 332, డోన్‌నియోజక వర్గంలో 349, వెరసి మొత్తం 1958 బ్యాలెట్‌ యూనిట్లను అన్ని నియోజకవర్గాలకు చేరవేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సముక్షంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ లో అత్యంత పారదర్శకతతో నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి సప్లిమెంటరీ ఈవీఎంల ర్యాండమైజేషన్‌ను చేపట్టామని తెలిపారు.

Updated Date - May 04 , 2024 | 11:37 PM