Share News

దోపిడీ చేసి నీతులు మాట్లాడటమా?

ABN , Publish Date - May 04 , 2024 | 11:41 PM

వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఐదేళ్ల పాటు దోపిడీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ కూటమి డోన్‌ అసెంబ్లీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దోపిడీ చేసి నీతులు మాట్లాడటమా?

లిక్కర్‌ వ్యాపారంతో సంబంధం నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా

సిమెంటు ఫ్యాక్టరీని లాక్కున్నది బుగ్గన కాదా...!

ఆర్థిక మంత్రిపై కోట్ల ఫైర్‌

డోన్‌, మే 4: వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఐదేళ్ల పాటు దోపిడీ చేసి ఇప్పుడు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ కూటమి డోన్‌ అసెంబ్లీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం డోన్‌ మండలంలోని ఓబులాపురం, ఎర్రగుంట్ల, పెద్ద మల్కాపురం, చనుగొండ్ల, ఇందిరాంపల్లి గ్రామాల్లో కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కోట్ల మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీకి వస్తున్న వ్యతిరేకతను చూసి మంత్రి బుగ్గన మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. లిక్కర్‌ వ్యాపారాలతో తనకు సంబంధం ఉందని బుగ్గన ఆరోపణలు చేస్తు న్నారని, దాన్ని నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటానని కోట్ల సవాల్‌ విసిరారు. మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని లాక్కున్నది మీరు కాదా? అని ప్రశ్నించారు. సిమెంటు ఫ్యాక్టరీలో స్థానికులను ఉద్యోగాల నుంచి తొలగించి కార్మికులకు అన్యాయం చేయ లేదా? అని నిలదీశారు. ఆర్థిక మంత్రిగా బుగ్గన డోన్‌ నియోజకవర్గ రైతు లను ఏరోజైనా పట్టించుకున్నారా? అని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, ధర్మవరం చిన్న నాగిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు యాదవ్‌, దేవరబండ వెంకటనారాయణ, వడ్డె నారాయణ, చనుగొండ్ల వెంకోబరావు, కోనేటి కాశీ, శ్రీరాములు, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయకులు బ్రహ్మం పాల్గొన్నారు.

టీడీపీలో చేరిన వైసీపీ కార్యకర్తలు: మండలంలోని ఓబులాపురం గ్రామంలో శేషిరెడ్డి ఆధ్వర్యంలో 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సమక్షంలో పార్టీ మారారు.

Updated Date - May 04 , 2024 | 11:41 PM