Share News

స్పష్టమైన అవగాహనతో విధులు నిర్వర్తించాలి

ABN , Publish Date - May 04 , 2024 | 11:31 PM

ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల (ఏపీఓ) పాత్ర కీలకమని, వీరు ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన పెంచుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.దిల్లీరావు సూచించారు.

 స్పష్టమైన అవగాహనతో   విధులు నిర్వర్తించాలి

స్పష్టమైన అవగాహనతో

విధులు నిర్వర్తించాలి

పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్‌ దిల్లీరావు

కృష్ణలంక, మే 4 :ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా, నిష్పాక్షికంగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఎన్నికలను నిర్వహించడంలో ప్రిసైడింగ్‌ అధికారులు (పీఓ), సహాయ ప్రిసైడింగ్‌ అధికారుల (ఏపీఓ) పాత్ర కీలకమని, వీరు ప్రతి అంశంపైనా స్పష్టమైన అవగాహన పెంచుకొని చిత్తశుద్ధి, అంకితభావంతో నిష్పక్షపాతంగా పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.దిల్లీరావు సూచించారు. శనివారం విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో సెంట్రల్‌ నియోజకవర్గానికి సంబంధించి పీఓ, ఏపీఓల శిక్షణా కార్యక్రమం జరిగింది. అసెంబ్లీ స్థాయి మాస్టర్‌ ట్రైన్లు (ఏఎల్‌ఎంటీ) ద్వారా జరుగుతున్న రెండో దశ శిక్షణా కార్యక్రమాన్ని దిల్లీరావు పరిశీలించారు. పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌, వీడియోల ప్రదర్శన ద్వారా వివిధ అంశాలపై ట్రైనర్లు శిక్షణ ఇస్తున్న తీరును పరిశీలించారు.

Updated Date - May 04 , 2024 | 11:31 PM