Share News

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ విజయవంతం

ABN , Publish Date - May 04 , 2024 | 01:05 AM

విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈవీ ఎంల తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌(బ్యాలెట్‌ యూనిట్లు), రెండో ర్యాండ మైజేషన్‌(బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లు) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది.

ఈవీఎంల ర్యాండమైజేషన్‌ విజయవంతం

కృష్ణలంక, మే 3: విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఈవీ ఎంల తొలి సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌(బ్యాలెట్‌ యూనిట్లు), రెండో ర్యాండ మైజేషన్‌(బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లు) ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. కలెక్టరేట్‌ ఇంటిగ్రేటెడ్‌ కంట్రోల్‌ రూంలో శుక్ర వారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు ఆధ్వర్యంలో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో విజయవాడ పార్లమెంటరీ నియోజ కవర్గానికి బ్యాలెట్‌ యూనిట్ల సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహిం చారు. మధ్యాహ్నం జనరల్‌ అబ్జర్వర్లు మంజూ రాజ్‌ పాల్‌, నరీందర్‌ సింగ్‌ బాలిలతో పాటు అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బీయూ, సీయూ, వీవీ ప్యాట్ల రెండో ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. విజయ వాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో 17 మంది పోటీలో ఉన్నారని, దీంతో రెండో బ్యాలెట్‌ యూనిట్‌ అవసరమైందని సప్లిమెంటరీ ర్యాండమైజేషన్‌ ప్రక్రి యను చేపట్టి, విజయవంతంగా నిర్వహించామని కలెక్టర్‌ తెలిపారు. ఒక బ్యాలెట్‌ యూనిట్‌లో 15 మంది, ఒక నోటా బటన్‌కు మాత్రమే వీలుంటుం దన్నారు. 2,147 అదనపు బీయూల కేటాయింపునకు ఈ సప్లిమెంటరీ ర్యాండ మైజేషన్‌ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఈవీఎంలను పోలింగ్‌ స్టేషన్లకు అనుసంధానించేందుకు రెండో ర్యాండమైజేషన్‌ కూడా చేపట్టినట్లు తెలిపారు. 4,294 బీయూలు, 2,147 సీయూలు, 2,324 వీవీ ప్యాట్లకు ప్రక్రియ నిర్వహిం చినట్టు కలెక్టర్‌ వివరించారు.

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కండి

ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక జనరల్‌ అబ్జర్వర్లు మంజూరాజ్‌పాల్‌, నరీందర్‌సింగ్‌ బాలిలు విజయవాడ పార్లమెం టరీ నియోజకవర్గంలో పోటీలో నిలిచిన అభ్యర్థులు, అభ్యర్థుల ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా శాంతియు తంగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఉల్లంఘనలపై తమకు ఫిర్యాదు చేయొచ్చన్నారు. డీఆర్వో వి. శ్రీనివాసరావు, ఎన్నికలసెల్‌ సూపరింటెండెంట్‌ ఎం.దుర్గాప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 01:05 AM