Share News

గన్నవరం సీటును భువనమ్మకు కానుకగా ఇస్తా

ABN , Publish Date - May 05 , 2024 | 12:02 AM

టీడీపీ కంచుకోట గన్నవరంలో ఈసారి కూడా టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని, గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ టీడీపీ తరపున రెండుసార్లు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీలో చేరి తన రాజకీయ ఎదుగుదలకు కారణ భూతుడైన చంద్రబాబు కుటుంబంపై అభాండాలు వేసి అవమానించిన స్థానిక ఎమ్మెల్యేకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పి ఈ సీటును భువనమ్మకు కానుకగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

 గన్నవరం సీటును భువనమ్మకు కానుకగా ఇస్తా
ఆత్కూరులో యార్లగడ్డకు మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు

ఉంగుటూరు, మే 4 : టీడీపీ కంచుకోట గన్నవరంలో ఈసారి కూడా టీడీపీ అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని, గన్నవరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ టీడీపీ తరపున రెండుసార్లు పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత వైసీపీలో చేరి తన రాజకీయ ఎదుగుదలకు కారణ భూతుడైన చంద్రబాబు కుటుంబంపై అభాండాలు వేసి అవమానించిన స్థానిక ఎమ్మెల్యేకి ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధిచెప్పి ఈ సీటును భువనమ్మకు కానుకగా ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. శనివారం మండలంలోని ఆత్కూరు, పెదఅవుటపల్లిలో స్థానిక టీడీపీ గ్రామకమిటీ, మండల కమిటీ, జనసేన నేతలతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి అడుగుపెట్టిన యార్లగడ్డకు ప్రజలు అడుగడు గునా నీరాజనాలు పట్టారు. యువత బైక్‌ విన్యాసాలతో కదం తొక్కారు. కార్యకర్తలు గజమాలలు వేస్తూ వీధివీధినా పూలవర్షం కురిపిస్తుండగా, మహిళలు మంగళహారతు లిస్తూ తమ గ్రామంలోకి ఘన స్వాగతం పలికారు. బందరు ఎంపీగా బాలశౌరిని, గన్న వరం ఎమ్మెల్యేగా తనను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్ర మంలో పార్టీ నాయకులు అట్లూరి రామ్‌కిరణ్‌, సుజన్‌బాబు, మున్నా రామకృష్ణ, కు ందేటి చంద్రశేఖర్‌, ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, మండవ రమ్యకృష్ణ, కొండేటి కొండలరావు, వెంకటేశ్వ రరావు, బచ్చుల సుబ్రహ్మణ్యం (బోస్‌), దారం విజయ్‌, సుధాకర్‌, ఫకీర్‌, సూర్యనారాయణ, తదితర నాయకులతోపాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యార్లగడ్డ విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారం

హనుమాన్‌జంక్షన్‌: టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు విజయాన్ని కాంక్షిస్తు శనివారం బాపులపాడులో టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్య కర్తలు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జంక్షన్‌ పట్టణ అధ్యక్షుడు అట్లూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామంలోని ఎస్పీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావులను అత్యధిక మెజా రిటీతో గెలిపించాలని కోరుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థిచారు. కార్యక్రమంలో నాయకులు వీరమాచనేని సత్య ప్రసాద్‌, దాసరి బెనర్జీ, సుజాత, గొట్టాపు వాసు, కాకాని రాజమహేం ద్ర, మొప్పా వేంకటేశ్వరావు, బోయపాటి ప్రసాద్‌, కేశనకుర్తి రమేష్‌, మాకినేని శ్రీనివాసరావు, తదితర బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమితోనే ప్రజాసంక్షేమం

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌ : గ్రామీణ ప్రాంతాల అభి వృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే సత్తాగల నాయకుడు చంద్రబాబునాయుడని సీనియర్‌ నాయకుడు అవిర్నేని సోమేశ్వరరావు అన్నారు. బిళ్లనపల్లిలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో శనివారం ఇంటింటి ప్రచా రంలో ఆయన పాల్గొన్నారు. గన్నవరం అభివృద్ధి కోసం కృషి చేసే నాయకుడు టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలి వెల రామకృష్ణ, ఎదురువాడ ప్రసాద్‌, కిలారు నరేష్‌, ఆలూరి రాంబాబు, గొట్టిపాటి శ్రీనివాస్‌, కాకుమాను శ్రీనివాసరావు, మాదాల శ్రీనివాసరావు, ఎదురువాడ నాగభూషణం, తదితరులు పాల్గొన్నారు.

మెరుగైన ప్రజాపాలన

టీడీపీ కూటమితోనే ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందిస్తూ మెరుగైన ప్రజాపాలన సాధ్యమని జనసేన నాయకుడు అడపా దేవులబాబు అన్నారు. ఎస్‌.ఎన్‌.పాలెంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. బాలశౌరి, యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నుబోయిన వెంకటనారాయణ, అడపా సతీష్‌, మత్తి రామారావు, కంపసాటి కొండలరావు, తమ్మిశెట్టి ప్రసాద్‌, శ్రీనివాస్‌, సాంబశివరావు, తదితరులు పాల్గొన్నారు.

టీడీపీలోకి భారీగా చేరికలు

దళితులకు రక్షణ కల్పించలేని ప్రభుత్వాన్ని కలసికట్టుగా పారద్రోలాలని మల్లవల్లి మాజీ ఎంపీటీసీ బొకినాల సాంబ శివరావు అన్నారు. బొమ్ములూరు, మల్లవల్లి తదితర గ్రామాల నుంచి సుమారు 83మంది వైసీపీ కార్యకర్తలు శనివారం టీడీపీలో చేరారు. కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వారికి టీడీపీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. బొమ్ములూరు నుంచి పంచాయితీ పాలకవర్గ సభ్యుడు గుదే చంటి, చెప్పిళ్ల దావీదు, మాతంగి రంగారావు తదితరులు, కొత్తపల్లికి చెందిన కోరం వెంకట స్వామి ఆధర్యంలో 8మంది, పెరికీడుకు చెందిన గేదల రామచంద్రరావు ఆధ్వర్యంలో 10మంది, కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో 12మంది, బిళ్లనపల్లికి చెందిన ఏసేబు, రాజు ఆధ్వర్యంలో 10మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో గండేపూడి నితీష్‌కుమార్‌, మాతంగి వెంకటేశ్వరరావు, ముసునూరి కృష్ణారావు పాల్గొన్నారు.

బల్లిపర్రులో..

గన్నవరం : టీడీపీ అధికారంలోకి వస్తేనే భవన నిర్మా ణ కార్మికులకు మనుగడ ఉంటుందని ఎస్సీసెల్‌ జిల్లా ఉపా ధ్యక్షుడు నిమ్మకూరి మధు అన్నారు. బల్లిపర్రులో శనివా రం యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని బాలశౌరిలలను గెలిపించాలని కోరుతూ టీడీపీ ఎస్సీసెల్‌ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.

Updated Date - May 05 , 2024 | 12:02 AM