Share News

బ్యాంకుల వద్ద తగ్గని రద్దీ

ABN , Publish Date - May 05 , 2024 | 12:04 AM

సామాజిక పింఛను తీసుకు నేందుకు వచ్చే వారితో ఉయ్యూరులో బ్యాంకులవద్ద శనివారం కూడా రద్దీ కొనసాగింది. లబ్ధిదారులు అందరూ నగదు తీసుకునేందుకు రావడంతో అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతుంది. మండే ఎండల్లో సైతం వృద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి డబ్బుకోసం పడిగాపులు పడుతున్నారు.

 బ్యాంకుల వద్ద తగ్గని రద్దీ
ఉయ్యూరులో బ్యాంకుల వద్ద పింఛనుదారులు

ఉయ్యూరు, మే 4 : సామాజిక పింఛను తీసుకు నేందుకు వచ్చే వారితో ఉయ్యూరులో బ్యాంకులవద్ద శనివారం కూడా రద్దీ కొనసాగింది. లబ్ధిదారులు అందరూ నగదు తీసుకునేందుకు రావడంతో అన్ని బ్యాంకుల వద్ద రద్దీ కొనసాగుతుంది. మండే ఎండల్లో సైతం వృద్ధులు బ్యాంకుల వద్దకు వచ్చి డబ్బుకోసం పడిగాపులు పడుతున్నారు. దివ్యాంగులు, బ్యాంకుకు రాలేని స్థితిలో ఉన్న వారికి ఇంటివద్ద పింఛను అందజేయగా, మిగిలిన వారికి బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. దీంతో ఎండను సైతం లెక్క చేయక బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకు నేందుకు కౌంటర్లవద్ద గుమికూడుతున్నారు. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గేటు బయట పింఛను తీసుకు నేందుకు వచ్చేవారికి టెంట్‌లు వేసి కూర్చునేందుకు కుర్చీలు వేసి తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయగా మిగిలిన బ్యాంకులవద్ద ఏవిధమైన సౌకర్యం లేకపోవడంతో వృద్ధులు ఇబ్బంది పడ్డారు.

వృద్ధులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ

కంకిపాడు : చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభు త్వం తప్పుడు ప్రచారం చేస్తుందని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగ జయప్రకాష్‌ అన్నారు. కంకి పాడులోని పలు బ్యాంకుల వద్ద పింఛన్‌ తీసుకునేం దుకు వచ్చే వృద్ధులకు శనివారం ఆయన మజ్జిగ ప్యా కెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జయప్రకాష్‌ మాట్లాడుతూ, అధికార యంత్రాంగం ఇప్పటికీ జగన్‌ మోహన్‌ రెడ్డికి తొత్తులా వ్యవహరిస్తుందన్నారు. కావాలనే పింఛన్‌ తీసుకునే పండుటాకులను ఇబ్బందుల పాలు చేస్తుందని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే పండుటాకులకు, నడవలేని వారికి, వికలాంగులకు ఇంటింటికి పింఛన్‌ పింపిణీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదే అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన పార్టీ నాయకులు గడ్డం నెహ్రు, దొప్పలపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:04 AM