Share News

అసమర్థ జోగికి ఓటుతో వాత పెట్టాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:07 AM

టీడీపీ ప్రభుత్వ హ యాంలో తొంభై శాతం పూరైయిన టిడ్కో గృహాలను మిగిలిన పదిశాతం పూర్తి చేసి లబ్ధిదారులకు అం దించలేని అసమర్థ మంత్రి జోగి రమేష్‌కు ఎన్నికల్లో ఓటుతో వాత పెట్టాలని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు.

 అసమర్థ జోగికి ఓటుతో వాత పెట్టాలి
యనమలకుదురులో బోడె ప్రసాద్‌, వల్లభనేని అరుణ్‌కు హారతులిస్తున్న మహిళలు

పెనమలూరు, మే 4 : టీడీపీ ప్రభుత్వ హ యాంలో తొంభై శాతం పూరైయిన టిడ్కో గృహాలను మిగిలిన పదిశాతం పూర్తి చేసి లబ్ధిదారులకు అం దించలేని అసమర్థ మంత్రి జోగి రమేష్‌కు ఎన్నికల్లో ఓటుతో వాత పెట్టాలని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. శనివారం కూటమి ఎంపీ అభ్యర్థి బాలశౌరి తనయుడు అరుణ్‌తో కలిసి యనమలకుదురులో ప్రచార పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ పెడనలో భారీగా అవినీతి చేయడం వల్లే ఇక్కడికి మంత్రి జోగి డంప్‌ అయ్యాడని, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, మట్టి మాఫియా గురించి అక్కడి వారు ఇక్కడి ప్రజలకు ఫోన్‌లు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో అనంతనేని ఆజాద్‌, వెలగపూడి బాబూరావు, శొంఠి శివరాంప్రసాద్‌, యేకుల విజయేంద్ర, వీరంకి కుటుంబరావు, ముప్పా రాజా, మొక్కపాటి శ్రీనివాస్‌, ముప్పవరపు నారాయణ, తాతపూడి గణేష్‌, మాచిన శివకుమార్‌, వీరంకి నంది, పాదాల ప్రభాకర్‌, ఇబ్రహీం, ధనేకుల భార్గవ్‌, సుంకర చినబాబు, పండల రజిని, షాహీనా పాల్గొన్నారు.

కూటమిని గెలిపించుకోవాలి

కంకిపాడు : కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకో వాల్సి న అవసరముందని టీడీపీ ఎస్సీ సెల్‌ జిల్లా కార్యదర్శి బత్తుల కామేశ్వరరావు అన్నారు. కంకిపాడు ఎస్సీ కాలనీ లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్సీ సెల్‌ నాయకులు బండి కృష్ణబాబు, దొప్పలపూడి నాగే శ్వరరావు, జల్లె కోటేశ్వరరావు పాల్గొన్నారు. కంకిపాడులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు పులి శ్రీనివాసరావు, కొండా నాగేశ్వరరావు, గోగినేని వెంకట రమణ, ఏనుగ జయప్రకాష్‌, చలవాది రాజా, వణుకూరు విక్రం, బొరార వెంకట్‌, జనసేన పార్టీ నాయకులు ముప్పా చంద్రశేఖర్‌, బోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కూటమితోనే ఉపాధి, ఉద్యోగాలు

ఉయ్యూరు : వైసీపీ పాలనలో కార్మికులకు ఉపాధి, యువతకు ఉద్యోగాలు లేక వలసలు పోవాలిసిన దుస్థితి ఏర్పడిందని, దీనినుంచి బయటపడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడేందుకు ప్రజలు నడుంబిగించాలని టీడీపీ పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థి బోడె ప్రసాద్‌, జనసేన మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి తనయులు బోడె వెంకట్రామ్‌, వల్లభనేని అరుణ్‌ అన్నారు. ఉయ్యూరు నగర పంచాయతీ 11వ వార్డులో శనివారం పర్యటించి తండ్రుల తరుఫున ఎన్నికల ప్రచారం చేశారు.

ముదునూరులో..

కూటమి ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తుందని, తెలుగు మహిళ అధికార ప్రతినిధి పాలడుగు మాధవీలత, టీడీపీ ముదునూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు దూసర అజయ్‌ కుమార్‌ అన్నారు. శనివారం ముదునూరు ఇందిరానగర్‌లో కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. మాజీ సర్పంచ్‌ తుమ్మల రామకోటయ్య, పార్టీ నాయకులు పాలడుగు బాలాజీ, మత్తే మహేశ్‌, భాస్కర్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:07 AM