Share News

ఆసరా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు..?

ABN , Publish Date - May 02 , 2024 | 11:48 PM

మండలం లో చాలా గ్రూపులకు ఆసరా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని పలువురు మహిళలు అధికారుల ను కోరుతున్నారు.

ఆసరా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు..?
నిరసన తెలియజేస్తున్న మహిళలు

కురబలకోట, మే 2: మండలం లో చాలా గ్రూపులకు ఆసరా డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని పలువురు మహిళలు అధికారుల ను కోరుతున్నారు. గురువారం మండలంలోని అంగళ్ళు పంచా యతీ ఇందిరాపురం కు చెందిన మహిళా సభ్యులు తమ గ్రూపుల కు డబ్బులు జమ కాకపోవడంతో సచి వాలయ సిబ్బందితో వాగ్వాదం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కేవలం కొన్ని గ్రూపులకు మాత్రేమే జమ చేశారని మా గ్రూపులకు ఎందుకు ఇప్పటిదాకా ఇవ్వలేదన్నారు. పలుమార్లు మీ దృష్టికి తీసుకొచ్చినా ఇప్పటి దాకా ఒరిగిదందేమీ లేదన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి శేషగిరి మాట్లాడుతూ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగి వెళ్లారు.

Updated Date - May 02 , 2024 | 11:48 PM