Share News

ప్రజల ఆస్తులను కాజేసేందుకే భూ హక్కుల చట్టం

ABN , Publish Date - May 04 , 2024 | 11:01 PM

దేశంలో 29 రాష్ర్టాల్లో లేని భూహక్కుల చట్టాన్ని (టైటిలింగ్‌ యాక్ట్‌) ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేసిందని, ప్రభుత్వం దీనిని వెంటనే రద్దు చేయకుంటే మరో బలమైన ఉద్యమాన్ని చేయవల్సి వస్తుందని రాయచోటి బార్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎన. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పీ. రెడ్డెయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ప్రజల ఆస్తులను కాజేసేందుకే భూ హక్కుల చట్టం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బార్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎన. ప్రభాకర్‌రెడ్డి

రాయచోటిటౌన, మే4: దేశంలో 29 రాష్ర్టాల్లో లేని భూహక్కుల చట్టాన్ని (టైటిలింగ్‌ యాక్ట్‌) ఆంధ్రప్రదేశ ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేసిందని, ప్రభుత్వం దీనిని వెంటనే రద్దు చేయకుంటే మరో బలమైన ఉద్యమాన్ని చేయవల్సి వస్తుందని రాయచోటి బార్‌ అసోసియేషన అధ్యక్షుడు ఎన. ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పీ. రెడ్డెయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం ఏదైనా కొత్త చట్టం తేవాలనుకుంటే ఉన్న చట్టాల కంటే మెరుగైనదిగా ఉండాలి. కానీ, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ యాజమాన్య హక్కుల చట్టం-22తో ప్రజల ఆస్తులకు ఏ మాత్రం భద్రత లేదన్నారు. ప్రజల ఆస్తులకు టైటిలింగ్‌ చట్టంతో శాశ్వత హక్కును కలిగిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, వారికి శాశ్వతంగా ఆస్తులు దూరమయ్యే పరిస్థితులు ఈ చట్టంతో వస్తాయని వఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులను న్యాయమూర్తులను చేస్తూ ప్రజల ఆస్తులకు హక్కులను వారు నిర్ణయించే ట్లుగా ఈ చట్టం ఉందని, దీనివలన న్యాయవ్యవస రాజ్యాంగం కల్పించిన స్వతంత్రతను కోల్పోయే పరిస్థితి వస్తుందని, దీంతో ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులు చెప్పినట్లు భూముల హక్కులు నిర్ణయించబడతాయని, ఈ పరిస్థితి సమాజానికి ప్రమాదకరమన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 553 సివిల్‌ కోర్టులు 12 వేల మంది సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నా కేసులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అయితే టైటిలింగ్‌ యాక్ట్‌ ప్రకారం 26 ట్రిబ్యునల్స్‌ రాష్ట్రంలో పనిచేసి త్వరితగతిన కేసులు పరిష్కరిస్తామని చెప్పడం అందరి చెవుల్లో పువ్వులు పెట్టడమేనన్నారు. ఈ చట్టం అమల్లోకి వస్తే సివిల్‌ కోర్టుల్లో వివాదాల పరిష్కారానికి కేసులు వేయడం కుదరదని, ట్రిబ్యునల్‌ ఇచ్చే తీర్పులను హైకోర్టులో రివిజన మాత్రమే చేయవచ్చునని, దీనివలన ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ట్రిబ్యునల్స్‌లో భూమి హక్కు పత్రాలన్నింటిపైన సమగ్ర విచారణ ఉండదని, రాజకీయ నాయకులు చెప్పిన విధంగా రెవెన్యూ అధికారుల విచారణలు జరుగుతాయన్నారు. వివాదాలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి మండలానికి ఒక కోర్టును ఏర్పాటు చేిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుందని, అలా కాకుండా న్యాయవ్యవస్థను తన చేతుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వం ఈ చట్టం ద్వారా ప్రయత్నించడం సరైంది కాదన్నారు. ఈ చట్టంతో ప్రజల ఆస్తులకు భద్రత లేదని, దీనిని వెంటనే రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు, ప్రజా సంఘాలు రెండు నెలల పాటు వివిధ రూపాల్లో ఉద్యమించినప్పటికీ ప్రభుత్వం చాప కింద నీరులాగా ఈ చట్టాన్ని అమలు చేయాలని చూస్తోందన్నారు. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మరో బలమైన ఉద్యమాన్ని చేయవల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఇలాంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలు చేస్తున్న ప్రభుత్వాలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ప్రజలకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన సహాయ కార్యదర్శి డీ. నాగముని, న్యాయవాదులు రాజ్‌కుమార్‌రాజు, ఆనందకుమార్‌, చిన్నయ్య, నరసింహారెడ్డి, హుమయూనబాషా, రెడ్డిబాషా, రవిశంకర్‌, ఇలియాస్‌బాషా, వరలక్ష్మి, ఖుష్ణుము, ఉత్తేజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:02 PM