Share News

మదనపల్లె జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలున్నాయి

ABN , Publish Date - May 04 , 2024 | 12:15 AM

మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని పలురంగాలకు చెందిన మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

మదనపల్లె జిల్లా కేంద్రానికి అన్ని అర్హతలున్నాయి
మదనపల్లె జిల్లా ఏర్పాటు చర్చావేదికలో మాట్లాడుతున్న విద్యావేత్త గురుప్రసాద్‌

చర్చాగోష్టిలో మేధావుల సూచన

మదనపల్లె టౌన, మే 3: మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటుకు అన్ని అర్హతలు ఉన్నాయని పలురంగాలకు చెందిన మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ప్రైవేటు కళ్యాణమండపంలో బీటీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ ఆర్‌.తులసీరామ్‌ నాయుడు ఆధ్వర్యం లో మదనపల్లె జిల్లా చర్చా వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావేత్త రాటకొండ గురుప్రసాద్‌ మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలం నుంచి దేశం లోనే అతిపెద్ద రెవెన్యూ డివిజనగా పాలన అందించిన మదనపల్లెలో జిల్లా కేంద్రాని కావాల్సిన అన్ని వసతులు, సదుపాయాలు వున్నాయన్నారు. 200 ఏళ్లకుపైగా చరిత్ర వున్న మదనపల్లెలో ప్రతిష్టాత్మక జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన రిషివ్యాలీ, టీబీ చికిత్సకు ఆరోగ్యవరం మెడికల్‌ సెంటర్‌, ఆంధ్ర ఊటి హార్సిలీహిల్స్‌, లక్షలాదిమందికి విద్యాబుద్దులు నేర్పిన బీటీ కళాశాల ఉన్నాయన్నారు. పలువురు మేధావులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జిల్లా సాధనకు జరగబోయే ఎన్నికలలో సరైన నిర్ణయం తీసుకుంటేనే మదనపల్లె కేంద్రంగా జిల్లా వస్తుందన్నారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మధుబాబు మాట్లాడుతూ రెండేళ్ల క్రితం మదనపల్లె నిర్వహించిన మినిమహా నాడులో చంద్రబాబు హామీ ఇచ్చారని, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవ ర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని, యువగళంలో లోకేశ కూడా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంగో గంగారపు గౌతమ్‌రెడ్డి, నాదెళ్ల విద్యాసాగర్‌, పెరవలి నవీన, నిరంజననాని, రాటకొండ రాజేశ, మంజునాథ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 12:15 AM