Share News

అక్రమార్జన ఆపితే..సంక్షేమ పథకాలు అమలుచేయవచ్చు

ABN , Publish Date - May 04 , 2024 | 12:13 AM

జగన ప్రభుత్వం చేస్తున్న అక్రమార్జన, దోపిడీకి అడ్డుకట్ట వేస్తే...తద్వారా మిగిలే నిధులతో అన్ని సంక్షేమ పథకాలూ అమలు చేయవచ్చునని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు.

అక్రమార్జన ఆపితే..సంక్షేమ పథకాలు అమలుచేయవచ్చు
బి.కొత్తకోటలో మాట్లాడుతున్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌

బి.కొత్తకోట, మే3: జగన ప్రభుత్వం చేస్తున్న అక్రమార్జన, దోపిడీకి అడ్డుకట్ట వేస్తే...తద్వారా మిగిలే నిధులతో అన్ని సంక్షేమ పథకాలూ అమలు చేయవచ్చునని టీడీపీ రాష్ట్ర కార్యని ర్వాహక కార్యదర్శి పర్వీనతాజ్‌ పేర్కొన్నారు. శుక్రవారం బి.కొత్తకోటలోని స్వగృహంలో ఆమె విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు-పవన కళ్యాణ్‌లు జనరంజక మేనిఫెస్టోను రూపొందిం చారని, అవినీతిని అరికట్టి రాష్ట్రప్రభుత్వ ఆదా యాన్ని పెంచుకుంటే కూటమి మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయడం కష్టమేమీ కాదని ఆమె అన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో 8లక్షల కోట్ల అవినీతి జరిగిందన్నారు. మధ్యం మాఫియా నే ఇందుకు ఉదాహరణ అన్నారు. ముస్లిం మైనారిటీల కోసం 50 ఏళ్లకే రూ.4000పింఛన, హజ్‌హౌస్‌ నిర్మాణం, ఈద్గాలు, ఖబరస్తానలకు స్థలాలు, మైనారిటీ కార్పొరేషన రుణాలు, 4శాతం రిజర్వేషనలకు చట్టబద్దత కల్పించడం లాంటి ఎన్నో హామీలతో కూటమి మేనిఫెస్టో ప్రజల ముందు నిలిచిందన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు కిట్టన్న, ప్రభాకర, పద్మనాభ, రవికుమార్‌, శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 12:13 AM