Share News

చెరువు నీళ్లను వదిలేస్తున్నారని ఫిర్యాదు

ABN , Publish Date - May 02 , 2024 | 11:50 PM

మండలంలోని ప్రధాన చెరువులైన పీటీఎం పెద్ద చెరువు, రంగసముద్రం రంగరాయ చెరువుల్లో నీటిని రాత్రి వేళల్లో ఎత్తేస్తున్నా రని గురువారం ఆయా చెరువుల ఆయకట్టు రైతులు మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కు పిర్యాదు చేశారు.

చెరువు నీళ్లను వదిలేస్తున్నారని ఫిర్యాదు

పెద్దతిప్పసముద్రం మే 2 : మండలంలోని ప్రధాన చెరువులైన పీటీఎం పెద్ద చెరువు, రంగసముద్రం రంగరాయ చెరువుల్లో నీటిని రాత్రి వేళల్లో ఎత్తేస్తున్నా రని గురువారం ఆయా చెరువుల ఆయకట్టు రైతులు మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కు పిర్యాదు చేశారు. ఈ రెండు చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీటిని ఆయా గ్రామాల్లోని మూగజీవాలైన గొర్రెలు, మేకలు, ఆవులకు ఆధారమని ఆ చెరు వుల నీరే కనుక లేక పోతే ఆయా గ్రామాల్లో ఉన్న మూగజీవాల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే కాకుండా ఈ చెరువుల్లో నీరు లేకుండా పోతే తాగునీటి బోర్లు కూడా ఎండిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ చెరువుల్లో కొందరు చేపలు పట్టుకునేందుకు రాత్రి వేళల్లో తూములు వదిలేస్తున్నాకరని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమస్య లను పలువురు రైతులు ఇరుగేషన అధికారులకు తెలియచేసినా కూడా పలి తం లేకుండా పోతోందని పలువురు రైతులు వాపోయారు. కనీసం ఇప్పటికైనా సంబందిత అదికారులు ఈ సమస్యలపై దృష్టి సారించి రైతులకు న్యాయం చేయాలని ఆయ కట్టు రైతులు కోరుతున్నారు.

Updated Date - May 02 , 2024 | 11:50 PM