Share News

ఈవీఎంల పనితీరుపై అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 02 , 2024 | 11:46 PM

ఎన్నికల స మయంలో పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీ ఎం, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోలింగ్‌ యూనిట్‌, వీవీప్యాట్‌(ఈవీఎం కమిష నింగ్‌)పనితీరుపై సెక్టోరియల్‌ అఽధికా రులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ సూచించారు.

ఈవీఎంల పనితీరుపై  అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సూచనలిస్తున్న ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, ఆర్‌వో

మదనపల్లె టౌన, మే 2: ఎన్నికల స మయంలో పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీ ఎం, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోలింగ్‌ యూనిట్‌, వీవీప్యాట్‌(ఈవీఎం కమిష నింగ్‌)పనితీరుపై సెక్టోరియల్‌ అఽధికా రులు అప్రమత్తంగా ఉండాలని ఎన్నికల అబ్జర్వర్‌ కవిత, రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ సూచించారు. గురువారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో సెక్టోరియల్‌ అధికారులకు ఈవీఎం కమిషనింగ్‌పై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పోస్టల్‌ బ్యాలెట్‌లో అభ్యర్థుల వరుస క్రమంలో 15 మంది అభ్యర్థులు, ఒక నోటా ఉండేలా చూసుకోవాలన్నారు. నియోజకవర్గంలోని 259 పోలింగ్‌ కేంద్రాల్లో 5శాతం ఓట్లను ర్యాండమ్‌ చెకిం గ్‌ చేయాలన్నారు. ప్రతి వెయ్యి ఓట్లు ట్యాలీ అయ్యాయా, లేదా సరిచూసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 11:46 PM