Share News

హోమ్‌ ఓటులో 10మంది ఓటుహక్కు వినియోగం

ABN , Publish Date - May 04 , 2024 | 11:22 PM

వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన ఇంటి వద్దే పోలింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు.

హోమ్‌ ఓటులో 10మంది ఓటుహక్కు వినియోగం

మదనపల్లె టౌన, మే 4: వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం కల్పించిన ఇంటి వద్దే పోలింగ్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. మదనపల్లె మండలంలో 85 ఏళ్ల దాటిన వారు, 40శాతం పైగా వికలత్వం వున్నవారిలో 11 మంది హోమ్‌ఓటు కోసం దరఖాస్తు చేసుకోగా వారందరికి హోమ్‌ఓటింగ్‌కు రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో శనివా రం మదనపల్లె ఎంపీడీవో భానుప్రసాద్‌ ఆఽధ్వర్యంలో పీవోలు, ఏపీవోలు ఎన్నికల సామగ్రితో 10 మంది ఇళ్ల వద్దకు వెళ్లి వారిచే పోలింగ్‌ నిర్వహించారు. 11 మంది హోమ్‌ఓటుకు దరఖాస్తు చేసు కోగా వారిలో ఒక వ్యక్తి మృతి చెందడంతో 10 మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించు కున్నారు. వీరిలో ముగ్గురు దివ్యాంగులు వుండగా, ఏడుగురు వయోవృద్ధులు ఉన్నారు. పీవోగా గురునాఽథ్‌, ఓపీవోగా సురేంద్ర, మైక్రో అబ్జర్వర్‌గా మల్లికార్జున, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2024 | 11:22 PM