Share News

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 05 , 2024 | 12:17 AM

తొండంగి, మే 4: గ్రామాల్లో అస్తవ్యస్థమైన రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ కూటమి తుని అభ్యర్థి యనమల దివ్య అన్నారు. శనివారం అద్దరిపేట, వేమవరం గ్రామాల్లో జరిగిన బాబు ష్యూ రిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ వైసీపీ పాలన

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

తొండంగి, మే 4: గ్రామాల్లో అస్తవ్యస్థమైన రహదారులు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని టీడీపీ కూటమి తుని అభ్యర్థి యనమల దివ్య అన్నారు. శనివారం అద్దరిపేట, వేమవరం గ్రామాల్లో జరిగిన బాబు ష్యూ రిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆమె మాట్లాడు తూ వైసీపీ పాలనలో రహదారులు గుంతల మయంగా మా రాయన్నారు. తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు అధ్వాన్నస్థితికి చే రాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని సరి చేసి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. కార్యక్రమంలో యనమల నాగేశ్వర్రావు, యనమల రాజేష్‌, కోడ వెంకటరమణ, చొక్కా అప్పారావు, ముత్తి మహేష్‌,ముత్తి రమణ, యజ్జల రమణ, చొక్కా కాశీ, సాధనాల నూకరాజు, అరిగెల నర్శింహమూర్తి, తాటిపర్తి శివ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:17 AM