Share News

జనచంద్రం

ABN , Publish Date - May 05 , 2024 | 12:36 AM

కాకినాడ సాగరతీరం జనచంద్రమైంది.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనంతో నగరం పసుపుమయంగా మారింది. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటీ సెంటర్‌ నుంచి నరసింహరోడ్‌, ఎన్టీఆర్‌ బ్రిడ్జి, సినిమారోడ్‌ మీదుగా సంతచెరువు సెంటర్‌ ప్రజాగళం బహిరంగ సభ ప్రదేశం వరకు రోడ్‌షో ఉత్సాహంగా కొనసాగింది. రోడ్‌షోలో ఎక్కడికక్కడ జనాలు బారులు తీసి పసుపు జెండాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు.

జనచంద్రం

  • కాకినాడలో నీరాజనం

  • ద్వారంపూడి జగన్‌రెడ్డి బినామీ

  • కాకినాడను అక్రమాలకు కేంద్రంగా మార్చారు..

  • మరొక పులివెందుల్లా చేయాలని చూస్తున్నారు..

  • పవన్‌ కాలిగోటికి ద్వారంపూడి సరిపోడు..

  • అలాంటి వాడిని చిత్తుగా ఓడించాలి

  • బహిరంగ సభలో చంద్రబాబు పిలుపు

కలెక్టరేట్‌(కాకినాడ), మే 4: కాకినాడ సాగరతీరం జనచంద్రమైంది.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును చూసేందుకు వచ్చిన జనంతో నగరం పసుపుమయంగా మారింది. కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటీ సెంటర్‌ నుంచి నరసింహరోడ్‌, ఎన్టీఆర్‌ బ్రిడ్జి, సినిమారోడ్‌ మీదుగా సంతచెరువు సెంటర్‌ ప్రజాగళం బహిరంగ సభ ప్రదేశం వరకు రోడ్‌షో ఉత్సాహంగా కొనసాగింది. రోడ్‌షోలో ఎక్కడికక్కడ జనాలు బారులు తీసి పసుపు జెండాలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. తప్పెటగుళ్లు, కోలా టాలు, తీన్‌మార్‌ డాన్స్‌లతో హోరెత్తించారు.అనంతరం కాకినాడ సంతచె రువు సెంటర్‌లో శనివారం జరిగిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడా రు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి జగన్‌రెడ్డి బినామీ అని చంద్రబాబునాయుడు అన్నారు. ద్వారంపూడి దొంగ అయితే జగన్‌రెడ్డి గజ దొంగ అని ధ్వజమెత్తారు.వీరిద్దరూ కాకినాడ నగరాన్ని గంజాయి కేంద్రంగా, డ్రగ్స్‌ కేపిటల్‌గా, దొంగ బియ్యం రవాణా చేసే కేంద్రంగా తయారచేశారని విమర్శించారు. అలాంటి ద్వారంపూడిని ఎన్నికల్లో జనం చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. భూమి రికార్డులుంటేనే మార్చేసి భూములు కబ్జా చేసి ఇక్కడ ఎమ్మెల్యే ఇక ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ అమల్లో ఉంటే కబ్జాలకు అడ్డే ఉండదని విమర్శించారు. ఎస్‌ఈజడ్‌లో 8700 ఎకరాలు కూడా చేతులు మారాయన్నారు. పరిశ్రమలు వస్తాయని ఎస్‌ఈజడ్‌ ద్వారా భూములు సేకరిస్తే వాటిని తరిమేసి ఎస్‌ఈజడ్‌ను సైతం లాగేసుకున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో వందకోట్ల రూపాయిల విలువైన భూదాన యజ్ఞం బోర్డు భూములను కాజేసేందుకు ద్వారంపూడి యత్నిం చారని ఆరోపించారు. జిల్లాలో పెద్దాపురం, జగ్గంపేట, అనపర్తి నియోజక వర్గాల్లో కోట్లాది రూపాయిల విలువైన గ్రానైట్‌ కొండలను తవ్వి అక్ర మార్జన చేశారని విమర్శించారు. ఆఖరికి కాకినాడలో సీబీసీఎన్‌సీ ఆస్తు లను సైతం కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. 26 వేల మంది ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టిన జయలక్ష్మీ కోఆపరేటీవ్‌ బ్యాంకు అక్రమాలకు అండగా నిలిచి ద్వారంపూడి లబ్ధిపొందారని ఆరోపించారు. ప్రశాంత నగరంగా పేరొందిన కాకినాడను మరొక పులివెందుల్లా తయారు చేసేందుకు వీరు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇలాంటి వైసీపీ రౌడీ లకు ఓటువేయకుండా తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. దొంగగా పేరుగాం చిన ద్వారంపూడికి పవన్‌కల్యాణ్‌కు సవాల్‌చేసే స్థాయి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. పవన్‌కల్యాణ్‌ కాలిగోటికి ద్వారంపూడి సరిపోడని విమర్శించా రు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైతే కాకినాడ నగరంలో టెక్నాలజీ టవర్‌ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌లు కాకినాడలోనే ఉండి అమెరికా, ఆస్ర్టేలియా వంటి దేశాల్లో ఉద్యోగాలు చేసే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. మత్స్యకారుల పాలిట పెనుశాపంగా తయారైన 217 జీవోను రద్దు చేసి.. మత్య్సకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. జిల్లాలో అన్ని స్థానాల్లో గెలుస్తామని, పిఠాపురంలో వర్మ బాగా పనిచేస్తున్నారని చంద్రబాబు కితాబిచ్చారు. కాకినాడ పార్లమెంట్‌ ఈవీఎంలో నెంబరు 9పై ఉన్న గాజుగ్లాసు గుర్తుపై ఓటు వేసి కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ అసెంబ్లీకి ఈవీఎంలో 4వ అంకెపై ఉన్న సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి బీసీ నాయకుడు వనమాడి కొండబాబును గెలిపించాలని కోరారు.టీడీపీ నాయ కుడు పిఠాపురం వర్మ చంద్రబాబుకు గంధంతో కూడిన మాలను మెడలో వేశారు. కుంకుమ బొట్టుగా పెట్టి విజయం తమదేనని ప్రకటించారు.

అడుగడుగునా నీరాజనం

కాకినాడ రూరల్‌, మే 4: కాకినాడ రూరల్‌ నియోజకవర్గం కరప మండలం నడకుదురులోని హెలిపాడ్‌ వద్ద దిగి రోడ్డు మార్గాన రూరల్‌ మండలం తూరంగికి సాయంత్రం 6.10 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు చేరుకున్నారు. ఆయనకు కాకినాడ రూరల్‌ కూటమి అభ్యర్థి పంతం నానాజీ ఘనస్వాగతం పలికారు. హెలిపాడ్‌ వద్దకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, కోఆర్డినేటర్‌ పిల్లి సత్తిబాబు, కోకోఆర్డినేటర్‌ కటకంశెట్టి ప్రభాకర్‌, టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, నురుకుర్తి వెంకటేశ్వరరావు, చప్పిడి వెంకటేశ్వరరావు, వీ.వై దాస్‌, చిక్కాల రామచంద్రరావు చేరుకోగా అక్కడే కాసేపు చంద్రబాబు వారందరితో మాట్లాడారు. అనంత రం పి.గన్నవరానికి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు మాజీ జడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు ద్వారా చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరారు. తదుపరి ప్రచార వాహనంలో తూరంగికి చేరుకోగా భారీ గజమాలతో స్వాగతం పలికి సైకిల్‌ ర్యాలీతో చంద్రబాబును ఆహ్వానించారు. కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు రెండురోజు లుగా చంద్రబాబు పర్యటన విజయవంతంపై పార్టీశ్రేణులను సమాయత్తం చేశారు. నగరం లోని పలు ప్రాంతాల నుంచి చంద్రబాబు రోడ్‌షో చూసేందుకు తరలివచ్చారు. సినిమా రోడ్‌ తిలక్‌స్ట్రీట్‌ సెంటర్‌ వద్ద చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ క్రేన్‌ సాయంతో గజ మాల వేశారు. పది వేల మంది జనాలు తరలి రావడంతో చంద్రబాబు రోడ్‌షో విజయవంతంగా సాగింది.

Updated Date - May 05 , 2024 | 12:36 AM