Share News

రేపు ప్రధాని మోదీ రాక

ABN , Publish Date - May 05 , 2024 | 12:33 AM

ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం రాజమహేంద్రవరం రానున్నారు. కూటమి భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌ కూడా రానున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హాజరవుతారు. విజయ శంఖా రావం పేరుతో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

రేపు ప్రధాని మోదీ రాక
వేమగిరి సమీపంలో ఎన్‌హెచ్‌ పక్కన ప్రధాని సభ కోసం చేస్తున్న ఏర్పాట్లు

ఎన్నికల సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌, పురందేశ్వరి

హైవే వద్ద టీడీపీ మహానాడు జరిగిన ప్రాంతంలోనే ఏర్పాట్లు

గోదావరి జిల్లాల నుంచి 2 లక్షల మంది వస్తారని అంచనా

ఎస్‌పీజీ సూచనల ప్రకారం భద్రత ఏర్పాట్లు.. ట్రాఫిక్‌ మళ్లింపు

రాజమహేంద్రవరం, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం రాజమహేంద్రవరం రానున్నారు. కూటమి భాగస్వాములుగా ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, జనసేన అధి నేత పవన్‌కల్యాణ్‌ కూడా రానున్నారు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి హాజరవుతారు. విజయ శంఖా రావం పేరుతో నిర్వహించే ఈ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అడిషనల్‌ డీజీ అతుల్‌సింగ్‌ ఆధ్వర్యంలో పోలీసు భద్రతా ఏర్పాట్లు జరు గుతున్నాయి. ఎస్‌పీజీ అధికారుల సూచనల మేరకు సభ వద్ద భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. ఆదివారం ఉదయానికి మొత్తం సభ ప్రాంగమంతా ఎస్‌పీ జీకి అప్పగించాలనే ఆదేశాలు ఉండడంతో చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌, తూర్పుగోదావరి ఎస్పీ జగదీశ్‌ భద్ర తా ఏర్పాట్లను చూస్తున్నారు. నలుగురు అడిషనల్‌ ఎస్పీలు, 8 మంది డీఎస్పీ లతోసహా మొత్తం 2,347 మంది పోలీస్‌ సిబ్బందిని ప్రధాని బందోబస్తుకు విని యోగిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర బలగాలు కూడా మోహరించాయి. ఎక్కడిక క్కడ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహన తనిఖీలను ముమ్మరం చేశారు. ట్రాఫిక్‌ మళ్లింపును గమనించుకుంటూ వాహనదారులు పోలీసులకు సహక రించాలని ఎస్పీ జగదీశ్‌ సూచించారు. 6వ తేదీన ఉదయం 6గంటల నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి వస్తాయన్నారు. అలాగే ప్రధాని మోదీ కాన్వాయ్‌ వెళ్లే మార్గాన్ని కొత్తగా ఏర్పాటుచేస్తున్నారు. హెలిపాడ్‌లో నేతలు కాన్వాయ్‌లో జాతీయ రహదారి మీదుగా మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి వెళ్లే రోడ్డుకు చేరుకుంటారు. ఈ మార్గంలో ఇబ్బందిలేకుండా ఇప్పటికే జాతీయ రహ దారిపై డివైడర్‌ని తొలగించారు. సభా స్థలికి చేరుకోవడానికి ఓ ప్రైవేటు వ్యక్తి పొలంలో రహదారిని ఏర్పాటుచేస్తున్నారు. ఈ మార్గంలో కాన్వాయ్‌ సభా ప్రాం గణానికి చేరుకుంటుంది. ఇక హోరుగాలి, వాన వచ్చినా కూడా చెక్కుచెదరని విధంగా సభా ప్రాంగణం ఏర్పాటుచేశారు. వేదిక ముందు 50 వేల మంది, ప్రాంగణంలో మరో 50 వేల ముందు కూర్చోవడానికి కుర్చీలు వేశారు. మొత్తం రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గు బాటి పురందేశ్వరి ఇక్కడ ఎంపీ బరిలో ఉండగా, నర్సాపురం లోక్‌సభలో కూట మి తరపున బీజేపీ అభ్యర్థి భూపతిరాజు వర్మ పోటీ చేస్తున్నారు. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వీరితోపాటు టీడీ పీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రధాని మోదీ ఇక్కడకు వస్తున్నారు. గోదావకి జిల్లాల పరిఽధిలో సభ కోసం జనం తరలి రానున్నారు. గత ఏడాది వేమగిరిలో టీడీపీ మహానాడు నిర్వహించిన బహిరంగ సభ ప్రాం తంలోనే ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ప్రధాని పాల్గొనే సభ వేదికపై మొత్తం 44 మంది ఆశీనులయ్యేటట్టు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ, టీడీపీ అఽధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుతోపాటు, కాకినాడ, అమలాపురం, నర్సాపురం, ఏలూరు పార్లమంట్‌ కూటమి అభ్యర్థులతోపాటు టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలకు కూడా అవకాశం ఉందని బీజేపీ ప్రోగ్రామ్‌ ఇన్‌చార్జి కాశీ విశ్వనాథ్‌రాజు తెలిపారు.

ఫ ప్రధానమంత్రి రాక ఇలా..

ప్రధాని మోదీ చత్తీస్‌గఢ్‌ నుంచి ప్రత్యేక విమానంలో సోమవారం మధ్యా హ్నం 2.55 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో సభాస్థలికి చేరుకుంటారు. 3.30 గంటలకు సభావేదిక మీదకు వస్తారు. 4.30 గంటలకు ఆయన ప్రసంగం ముగిస్తారు. ఆయన కోసం ప్రత్యేకంగా గ్రీన్‌రూమ్‌తోపాటు పలు సౌకర్యాలు ఏర్పాటుచేస్తున్నారు. ప్రధాని పయనించే హెలికాప్టర్‌ శనివారం సాయంకాలం ట్రయల్‌ రన్‌ వేసింది.

Updated Date - May 05 , 2024 | 12:33 AM