Share News

కూటమితో సంక్షేమ పథకాల పునరుద్ధరణ

ABN , Publish Date - May 05 , 2024 | 12:16 AM

కొత్తపల్లి, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభు త్వం వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ప థకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేప

కూటమితో సంక్షేమ పథకాల పునరుద్ధరణ
కొత్తపల్లి: ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేస్తున్న వర్మ

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

కొత్తపల్లి, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభు త్వం వైసీపీ ప్రభుత్వంలో రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ ప థకాలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టనుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ హామీ ఇచ్చారు. కొత్తపల్లి మండలంలో కొత్తమూలపేట, పొన్నాడ శివారు శీలంవారి పాకలు దళితవాడల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పవన్‌కల్యాణ్‌, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌కు గాజుగ్లాసుకే ఓట్లేసి అత్యధిక మెజార్టీతో నెగ్గించా లని శనివారం వర్మ ఇంటింటా ప్రచారం నిర్వంచారు. కూట మి ప్రభుత్వం అమలు చేసే మేనిఫెస్టో కరపత్రాలను ఓట ర్లకు పంపిణీ చేశారు. అనిశెట్టి సత్యానందరెడ్డి, మాతా మాధ వి, శీలం రాజామణి, గుత్తుర్తి త్రిమూర్తులు, మాతా బాలకృష్ణ, జనసేన నాయకులు వడ్డి రాజేష్‌ కార్యకర్తలు పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ

పిఠాపురం రూరల్‌, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ లభిస్తుందని, వారి జీవితాలకు భరోసా ఏర్పడుతున్నదని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మ సతీమణి లక్ష్మీదేవి తెలిపారు. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్‌కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురం మండలం విరవాడ గ్రామంలో ఆమె శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వర్మ ఎమ్మెల్యేగా ఉండగా నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారని, కూటమి ప్రభుత్వం రాగానే పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 2 పంటలకు పుష్కలంగా సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. గ్రామ మహిళా నాయకులు పావని, భూలక్ష్మి, నాగమణి, మహిళా విభాగం అధ్యక్షురాలు అన్నపూర్ణ, గాయత్రి, పద్మ, ధనలక్ష్మి, సత్యవేణి, దుర్గ, జనసేన పార్టీ నాయకురాలు వెంకటలక్ష్మి తదితరులున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:16 AM