Share News

కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు

ABN , Publish Date - May 05 , 2024 | 12:14 AM

పెద్దాపురం, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని పెద్దాపురం కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని 8వ వార్డులో ఆయన శనివారం ప్రచారం చేప ట్టారు. ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎ

కూటమితోనే రాష్ట్ర భవిష్యత్తు
పెద్దాపురంలో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చినరాజప్ప

పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప

పెద్దాపురం, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమితో రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని పెద్దాపురం కూటమి అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలోని 8వ వార్డులో ఆయన శనివారం ప్రచారం చేప ట్టారు. ప్రతీ ఇంటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆయనకు హారతులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎప్పుడూ తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్ర వెనుకబడిందన్నారు. మళ్లీ కూటమి అధికారం చేపట్టడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మెరుగుపడుతుదన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజాసూరిబాబు రాజు, కర్రి వెంకటరమణ, తూతిక రాజు పాల్గొన్నారు.

‘కూటమికి అనూహ్య స్పందన’

సామర్లకోట, మే 4: ఎన్నికలలో పోటీచేస్తున్న కూటమి అభ్యర్థులకు అన్ని వర్గాల నుంచీ అనూహ్యస్పందన, మద్దతు లభిస్తుందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చిన రాజప్ప, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు పేర్కొన్నారు. శనివారం సామర్లకోట లారీ ఓనర్స్‌, వర్కర్స్‌ యూనియన్‌ ఆహ్వానం మేరకు లారీ స్టాండ్‌ ఆవరణకు రాజప్ప, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌లు కూటమి నాయకులతో కలిసి లారీ కార్మికులను, ఓనర్లను కలిసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ యూనియన్‌ తరపున సంపూర్ణ మద్దతును ఇచ్చేందుకు అంగీకరించారు. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను యూనియన్‌ నాయకులు శాలువాలతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో యూనియన్‌ మాజీ నాయ కులు ముత్యం రాజబాబు, సప్పా సుబ్రహ్మణేశ్వరరావు, ప్రసా ద్‌, కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొ న్నారు. అనంతరం స్థానికంగా ఉన్న టాక్సీ స్టాండ్‌ ఓనర్స్‌, డ్రైవర్స్‌ యూనియన్‌, స్టేషన్‌ సెంటర్‌ ఆటో యూనియన్ల కార్మి కులను కలిసి టీడీపీకి మద్దతు తెలియజేయాలని ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు కోరడంతో వారు అంగీకరించారు.

వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

సామర్లకోట మండలంలోని రావువారి చంద్రంపాలెం గ్రా మానికి చెందిన వైసీపీ నాయకులు జల్లిగంపల సాయిబాబు, తలాటం త్రాసు, కొటికలపూడి బాబ్జీ, దేశిరెడ్డి వెంకన్నబాబు, గాదం సూరిబాబు, బొండా శ్రీను తదితర 30 మంది కార్యకర్తలు శనివారం రాజప్ప సమంక్షలో టీడీపీ చేరారు.

Updated Date - May 05 , 2024 | 12:14 AM