Share News

జగన్‌ది అధికార వ్యామోహమే

ABN , Publish Date - May 05 , 2024 | 12:39 AM

:అధికారంలోకి రావడం కోసం సీఎం జగన్‌రెడ్డి ఎంత నీచమైన రాజకీయాలు చేయ డానికైనా సిద్ధమని అతనికి అంతా పదవి వ్యామోహమే త ప్పా ప్రజలకు మేలు చేసిందిలేదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు.

జగన్‌ది అధికార వ్యామోహమే

అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి లేదు

ఎన్నికల ప్రచారంలో కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 4 :అధికారంలోకి రావడం కోసం సీఎం జగన్‌రెడ్డి ఎంత నీచమైన రాజకీయాలు చేయ డానికైనా సిద్ధమని అతనికి అంతా పదవి వ్యామోహమే త ప్పా ప్రజలకు మేలు చేసిందిలేదని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. రాజమహేంద్రవరం 7వ డివిజన్‌లో టీడీపీ మాజీ డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ కోరుమిల్లి విజయశేఖర్‌, మహిళా నాయకురాలు సయ్యద్‌ అప్సరీల ఆధ్వర్యంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, తెలుగుయువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా దేవివరప్రసాద్‌లతో కలిసి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఇంటింటా ఎన్నికల ప్రచారం చేశారు. ఈసందర్భంగా టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు, చిరువ్యాపారులు, కార్మికు లు, గృహిణులు, విద్యార్థులు, వృద్ధులు ఇలా అందరికీ కలిసి ఉమ్మడి మేనిఫెస్టో, లోకల్‌ మేనిఫెస్టో కరపత్రాలను ఆయన స్వయంగా అందించారు. స్ధానికంగా ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ ఆయా సమస్యలను కూటమి అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తామని హామీలు ఇస్తూ ప్రచారం చేశారు. అనంత రం ఆదిరెడ్డి శ్రీనివాస్‌ విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో పేదలకు సంక్షేమంలేదని, ప్రాంతాల వారీ అభివృద్ధి చేయలేదని, పరిశ్రమలు స్థాపించి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నా రు. కనీసం గతంలో అతను ఇచ్చిన హామీల ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయారన్నారు. దగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశాడన్నారు. డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్‌ చదువుకున్న వాళ్లు సైతం వారి చదువుకు తగ్గ ఉద్యోగాలు లేక కార్మికులుగాను, కూలీలుగాను మారి బతికే పరిస్ధితి ఉంద ని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో ఉన్న సహజ సంపదలను జగన్‌ సర్కార్‌ విచ్చలవిడిగా దోచుకుందన్నారు. రాష్ట్రాన్ని 25ఏళ్లు వెనక్కి నెట్టేశాడని పేదల బతుకులు తిరోగమనంలో ఉన్నాయన్నారు. సంక్షేమం అని రూ.10ఇచ్చి రూ.100 లాక్కున్నాడని ధ్వజమెత్తారు. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్‌ పట్టుబడిన దాని మూ లాలు ఆంధ్రప్రద్‌శ్‌లో కనిపించే విధంగా రాష్ట్రాన్ని దిగజార్చాడని మండిపడ్డారు. విద్యుత్‌ బిల్లులను ఇస్టానుసారం పెంచేశాడని, నిత్యావసరాలు దారుణంగా పెంచారని, పన్నుల పెంచి ప్రజల నడ్డివిరిచాడని అన్నారు. టీడీపీ హాయాంలో అభివృద్ధిలోను, సంక్షేమంలోను ప్రథమ స్థానంలో రాష్ట్రాన్ని ఈ రోజు పేద రాష్ట్రంగా మార్చేసిన ఘనుడు జగన్‌ అని ప్రజల చేతిలో ఉన్న ఓటు ఆనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తు, మీ బిడ్డల భవిష్యత్తును మీరేమార్చుకోవాలని ఓటర్లకు సూచించారు. సంపద సృష్టించి, ఉద్యోగాలు అవకాశాలు కల్పి ంచి, ప్రజల జీవితాలను బాగుచేసే కూటమిని అధికారంలోకి తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు.రాజమహేంద్రవరంలో ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయాన్ని పక్కనపెట్టి పెద్దలను, మేఽధావులను, ప్రజాసంఘాలను, వ్యాపారులను పక్కనపెట్టి అనాలోచిత నిర్ణయాలతో నగరాన్ని బ్రష్టు పట్టించిన భరత్‌ రామ్‌ లాంటి వాడిని నమ్మితే ఆదోగతే అన్నారు. అతని చదువు విషయంలోనే ఎన్నికల కమిషన్‌కు సరైన స్పష్టత ఇవ్వని వాడు మాటమీద నిలబడడని అన్నారు. అతనికి ఉన్న ప్రణాళికలు అన్నీ కమిషన్‌ కొట్టు, నాణ్యతలేని పనులు పట్టు విధానామేనన్నారు. ప్రజలు ఆలోచించి కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యేగా తనకు సైకిల్‌ గుర్తుపైన, ఎంిపీగా దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సయ్యద్‌ ఫయాజ్‌, కె.అప్పారావు, సిహెచ్‌ శ్రీను, ఎండీ సిలార్‌, రాజేశ్వరరావు, జి.సోమరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏడవ డివిజన్‌లో స్థానిక నాయకులు చిర్రా విజయరాజు, అర్థమూడి చిన్ని, కోరుమిల్లి రమేష్‌, యలమర్తి దుర్గామహేష్‌, చెవిటి ఎలిమియా, కాపారపు ప్రసాదులతో పాటు 300 మంది టీడీపీలో చేరారు. వాసు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

పేదల జీవితాలతో జగన్‌ చెలగాటం

రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి

కోరుకొండ, మే4: రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నకిలీ మద్యాన్ని ఎరులై పారించి పేదల జీవితాలతో చెలగాటం ఆడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. ఎన్నికలప్రచారంలో భాగంగా రాజానగరం నియోజకవర్గం కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ చిట్టూరి రవీంద్ర, నందమూరి రామకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జ్‌ నీరుకొండ వీరన్న చౌదరితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం కోరుకొండ మండలం గాడాల, నిడిగట్ల, మధురపూడి, బూరుగుపూడి, గుమ్ముళ్ళూరు బుచ్చింపేట, దోసకాయలపల్లి, నందరాడ, కోరుకొండ, కాపవరం, జంబుపట్నం, పశ్చిమగోనగూడెం, నర్సాపురం, గాదరాడ, కణుపూరు, రాజవరం, కోటికేశవరం, బొల్లేద్దుపాలెం, రాఘవాపురం, గరగలంపాలెం, శ్రీరంగపట్నం, మునగాల, కోటి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బూరుగుపూడి, గాడాల, దోసకాయలపల్లి, గాదరాడ, కోటికేశరంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ దశలవారీ మద్యపానం నిషేధం ఎక్కడ చేశారని జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి అయిన తనకు కమలం గుర్తుపైన, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గాజుగ్లాసు గుర్తుపైన ఓటువేసి ప్రజలు ఆశీర్వదించాలని పురందేశ్వరి ప్రజలను కోరారు. బ్యాలెట్‌ పేపర్లో 4వనెంబరులో తనకు, 5వ నెంబరులో బలరామకృష్ణకు ఓటు వేయాలన్నారు.

మీ బిడ్డలకు బంగారు భవిష్యత్‌ తెస్తాం: బత్తుల బలరామకృష్ణ

రాజానగరం నియోజకవర్గంలోని ప్రజలందరికీ బంగారు భవిష్యత్‌ను అందజేసే బాధ్యత తమదని జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదని బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. బ్లేడ్‌, గంజాయి బ్యాచ్‌లు లేని ప్రశాంతమైన రాజానగరం ఏర్పాటు చేస్తామన్నారు. కోరుకొండ మండలంలోని శనివారం 20 గ్రామాల్లో రోడ్‌షోలో బలరామకృష్ణ మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ ఇన్‌చార్జ్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, మాజీ ఎంపీ చిల్టూరి రవీంద్ర, నందమూరి బాలకృష్ణ, బీజేపీ ఇన్‌చార్జ్‌ నీరుకొండ వీరన్నచౌదరి, ఏపీఆర్‌ చౌదరి, తనకాల నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కంటే నాగ కేశవరావు ఆత్మీయ సమావేశంలో మాట్లాడి కూటమి అభ్యర్థులను అశీర్వదించాలని కోరారు.

ఫ ఉండేశ్వరపురంలో బత్తుల వెంకటలక్ష్మి ప్రచారం

ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సతీమణి బత్తుల వెంకటలక్ష్మి సీతానగరం మండలం ఉండేశ్వరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి కూటమి మేనిఫెస్టో కరపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బత్తుల వందనాంబిక, తోట ప్రత్యూషదేవి, తోట పవన్‌కుమార్‌, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

వైసీపీ హయాంలో 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు రద్దు

టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరి

కడియం/ రాజమహేంద్రవరంరూరల్‌ మే 4:కడియం మండలం వెంకయ్యపేటలో శనివారం రూరల్‌ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి గోరంట్ల బుచ్చయ్యచౌదరి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రచారం నిర్వహించారు. ముందుగా గణపతి ఆలయంలో పూజలు నిర్వహించారు. గ్రామంలో ప్రతీ ఇంటికీ వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టో పథకాలను వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి అధికారంలోకి రావాలని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత ఎస్సీ, ఎస్టీలకు చెందిన 27 పథకాలు రద్దు చేశారన్నారు. ఎస్సీ, ఎస్టీ నిధులు ప్రక్కదారి పట్టించారన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయగా ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన చేశారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్‌, సర్పంచ్‌ ఇన్‌చార్జి పాటంశెట్టి రాంజీ, టీడీపీ రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు మార్గాని సత్యనారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకలు గెడ్డం శివ, బొర్సు శేషగిరి, పాటంశెట్టి సుబ్బారావు, బోడపాటి గోపి, గట్టి వెంకన్నబాబు, గట్టి సుబ్బారావు, పంతం గణపతి ముత్తాబత్తుల విజయ, బొర్సు వెంకటేశ్వరరావు, పల్ల సూర్య, వీది సాయి, వారా నాగేష్‌, యాతం కాళీ, అయితిరెడ్డి గంగ పాల్గొన్నారు. అనంతరం కడియపులంక పూలమార్కెట్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలువురు పార్టీలో చేరారు. గోరంట్ల వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

హుకుంపేట ఎస్సీ కాలనీ, డీఎస్‌ఆర్‌నగర్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి కుమార్తెకంఠమనేని శిరీష పాల్గొన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు దుద్దుపూడి రామకృష్ణ, పెండ్యాల రామకృష్ణ, దుద్దుపూడి రమేష్‌, బొప్పన నానాజీ, మజ్జి పద్మ, మత్యేటి ప్రసాద్‌, చొప్పా చిన్నారావు, కరుటూరి శ్రీనివాసరావు తదితరులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సూపర్‌సిక్స్‌ పథకాలను వివరించారు. కంఠమనేని శిరీష మాట్లాడుతూ గోరంట్ల విజయం సాదిస్తేనే రూరల్‌ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ నాయకులు బొప్పన నాగేశ్వరరావు, కంటిపూడి చౌదరి, బాబూఖాన్‌, పెండ్యాల సూరిబాబు, బొప్పన సతీష్‌చౌదరి, ఎలమాటి రామకృష్ణ, కోటిపల్లి చంద్రశేఖర్‌, బిందు, రాణి, వల్లేపల్లి బలరామ్‌, దుద్దుపూడి టింకు, కంటిపూడి బాబి, పోతుల సత్తిబాబు, యార్లగడ్డ వెంకన్న, సుబ్రహ్మణ్యం, శ్రీను, వేణు, అఖిల్‌, జనసేన నాయకులు షేక్‌ అమీనా అరుణాచౌదరి, ఇంటి తాతాజీ, సోము వినాయక్‌, పోతు రాజేష్‌, బీజేపీ నాయకులు సిద్దని వెంకట్‌, ముద్రగడ సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:39 AM