Share News

పవన్‌కు విజయం చేకూర్చాలి

ABN , Publish Date - May 05 , 2024 | 12:19 AM

ఉప్పాడ (కొత్తపల్లి), మే 4: టీడీపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌, కాకినాడ ఎంపీ అభ్య ర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో విజయం చే

పవన్‌కు విజయం చేకూర్చాలి
ఉప్పాడలో ప్రచారం నిర్వహిస్తున్న జబర్దస్త్‌ నటులు

ఉప్పాడ (కొత్తపల్లి), మే 4: టీడీపీ కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌, కాకినాడ ఎంపీ అభ్య ర్థి తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌లను భారీ మెజార్టీతో విజయం చేకూర్చాలని జబర్దస్త్‌ టీమ్‌ సభ్యులు శనివారం ఉప్పాడ తీర ప్రాంత గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థి ఉదయ్‌శ్రీనివాస్‌ భార్యతో పాటు జబర్దస్త్‌ నటుడు బాబీ, యాంకర్‌ ప్రత్యూష మత్స్యకారుల ఇళ్లకు వెళ్లి గాజు గ్లాసుగుర్తుకు ఓట్లేసి అఖండ మెజార్టీ చేకూర్చాలని కోరారు. జనసేన రాష్ట్ర వీరమహిళ లక్ష్మీనాయుడు పవన్‌కు మద్దతుగా ఉప్పాడలో ప్రచారం నిర్వహించారు. సుమారు 7నెలల కింద ట సమద్రంపైకి వేటకు వెళ్లి గల్లంతైన వంకా కృపారావు ఆచూకీ ఇప్పటికీ దొరకలేదని, నేటి వరకు కుటుంబాన్ని ఏ ఒక్కరు ఆదుకోలేదని మత్స్యకారులు కన్నీటి వాపోయారు. ఈ విషయాన్ని పవన్‌ దృష్టికి తీసుకెళ్లి న్యా యం చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకుడు రమణ పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:19 AM