Share News

జాకీ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

ABN , Publish Date - May 05 , 2024 | 12:18 AM

కాకినాడ క్రైం, మే 4: కాకినాడ మెయిన్‌రోడ్డులోని జాకీ బట్టల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. చందనబదర్స్‌ సమీపంలో ఉన్న జాకీ స్టోర్‌ కింది భా

జాకీ స్టోర్‌లో అగ్ని ప్రమాదం

కాకినాడ క్రైం, మే 4: కాకినాడ మెయిన్‌రోడ్డులోని జాకీ బట్టల దుకాణంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. చందనబదర్స్‌ సమీపంలో ఉన్న జాకీ స్టోర్‌ కింది భాగంలో రిటైల్‌ షాపు ఉండగా పైఅంతస్తులో బట్టల స్టాక్‌ రూం ఉంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పైఅంతస్తులో ఒక్కసారిగా దట్టంగా పొగ కమ్మి మంటలు ఎగసిపడి దావాణంలా వ్యాపించాయి. కింద షాపులో ఉన్న సిబ్బంది ప్రమాదాన్ని గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో సాలిపేట అగ్నిమాపకాధికారి సుబ్బారావ్‌, జగన్నాధపురం ఏడీఎఫ్‌వో బి.ఏసుబాబు వారి శకటాలు, సిబ్బందితో ప్రమాదస్థలికి చేరుకుని ఇతర షాపులకు వ్యాపించకుండా మంటలను అదుపు చేశారు. విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ వల్లే అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నామని ఏడీఎఫ్‌వోలు తెలిపారు. ఆస్తినష్టం రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - May 05 , 2024 | 12:18 AM