Share News

ఆర్ట్స్‌ కళాశాలలో పోస్టల్‌ ఓటింగ్‌కు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు: ఆర్వో

ABN , Publish Date - May 05 , 2024 | 12:36 AM

పోస్టల్‌ ఓటింగ్‌ ఫెసిలిటేషన్‌లో ఈనెల 6,7,8 తేదీలలో నగరంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్‌వో దినేష్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 6న ఉదయం 8 నుంచి సెక్టార్‌ అధికారులు, బూత్‌లెవెల్‌ అధికారులు, డైవ్రర్లు, వీడియోగ్రాఫర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఆర్ట్స్‌ కళాశాలలో పోస్టల్‌ ఓటింగ్‌కు ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు: ఆర్వో

రాజమహేంద్రవరం సిటీ, మే 4: పోస్టల్‌ ఓటింగ్‌ ఫెసిలిటేషన్‌లో ఈనెల 6,7,8 తేదీలలో నగరంలో ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్‌వో దినేష్‌కుమార్‌ తెలిపారు. ఈనెల 6న ఉదయం 8 నుంచి సెక్టార్‌ అధికారులు, బూత్‌లెవెల్‌ అధికారులు, డైవ్రర్లు, వీడియోగ్రాఫర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఎన్నికల విధుల్లో ఉన్న పీవోలు, ఏపీవోలకు అక్కడే ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో నిర్వహిస్తారన్నారు. 7న ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జిల్లాస్ధాయిలో ఉన్న పోలీస్‌ సిబ్బంది, మైక్రో అబ్జర్వర్లు, వినియోగించుకోవాలన్నారు. అదేవిధంగా ది ఫ్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌ క్యాంప స్‌ కవలగోయ్యిలో ఏర్పాటుచేసిన ఓటరు ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో 7న ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు అత్యవసర శాఖ సిబ్బంది ఓటు హక్కువినియోగించుకోవాలన్నారు. 8న ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆర్ట్స్‌కళాశాల బుద్దభవన్‌లో ఎన్నికల విధుల్లో ఉన్న ఓపీవోలు ప్రభుత్వ అధికారులు తమ పోస్టల్‌ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఫారం 12 సమర్పించి సంబంధిత ఆర్‌వో చేత బాలట్‌ జారీ చేసిన వారందరూ పోటీ చేయు అభ్యర్థుల లేదా వారి ఏజెంట్ల సమక్షంలో నిర్వహించు ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఓటు హక్కునువినియోగించుకోవాలని కోరారు.

అపోహలకు తావులేకుండా ఈవిఎంలు కమిషనింగ్‌

రాజమహేంద్రవరం సిటీ, మే 4: ఎటువంటి అపోహలకు తావులేకుండా అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎమ్‌ల కమిషనింగ్‌ చేస్తున్నామని ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. స్థాక విటీ డిగ్రికళాశాలలో జరుగుతున్న రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఈవీఎమ్‌ల కమిషనింగ్‌ కోసం 20 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ షెడ్యూల్‌ విడుదల చేసిన ఆర్వో

అనపర్తి, మే 4 : అనపర్తి నియోజకవర్గంలో ఎన్నికల విదులు నిర్వహించే అధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకోవా లని దీని కోసం షెడ్యూల్‌ విడుదల చేసినట్లు అనపర్తి రిటర్నింగ్‌ అధికారిణి ఎం.మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. 6న ఉదయం 9 నుంచి సాయంత్రం 6గంటల వరకు రామారెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటుహక్కు వినియోగించుకోవాలన్నారు. 7వ తేదీన రాజమహేంద్రవరంలోని పిడింగొయ్యి లోని ది ప్యూచర్‌ కిడ్స్‌ స్కూల్‌లో ఏర్పాటుచేసిన ఓటర్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌లో జిల్లాస్థాయిలో ఉన్న అత్యవసర సేవల అధికారులు ఓటు హక్కును వినియో గించుకోవాలని అన్నారు. అదేరోజున రాజమహేంద్రవరం గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన సెంటర్‌లో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసులు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలన్నారు. 8వ తేదీన అనపర్తి జీబీఆర్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన సెంటర్‌లో ఓపివోలు, సెక్టార్‌ అదికారులు, బూత్‌ లెవెల్‌ అదికారులు, డ్రైవర్లు, వీడియో గ్రాపర్లు తమ ఓటు హక్కును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకోవాలని సూచించారు అదేరోజున హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ రెండోవిడత నిర్వహించనున్నామని అన్నారు.

ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోండి

ఎలక్షన్‌ ఆఫ్‌ ఇండియా అబ్జర్వర్‌ సందీప్‌ పాటిల్‌

గోకవరం, మే4: ప్రతీఒక్కరూ ధైర్యంగా ఓటు హక్కును వినియోగించుకోవా లని ఎలక్షన్‌ ఆఫ్‌ ఇండియా అబ్జర్వర్‌ సందీప్‌ పాటిల్‌ అన్నారు. గోకవరం మండలంలోని పలు సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను, స్టేటిక్స్‌ సర్వీలెన్స్‌ టీమ్‌ చెక్‌ పోస్టులను, చెక్‌ పోస్టులను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంరతం స్ధానికులతో సందీప్‌ పాటిల్‌ మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగం గా ప్రతీ ఓటరు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలన్నారు. ఆయన వెంట ఎస్‌ఐ కె.నాగరాజు, సిబ్బంది ఉన్నారు.

రాజానగరంలో

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు

రాజానగరం, మే 4 : రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల విఽధులకు కేటాయించిన సిబ్బంది తమ ఓటు హక్కును వివియోగించుకునేందుకు పాలచర్లలోని బీవీసీ ఇంజనీరిగ్‌ కళాశాలలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఫెసిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినట్లు ఆర్వో ఎ.చైత్రవర్షిణి శనివారం తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పీవో, ఏపీవో ఈనెల 6న, ఇతర పోలింగ్‌ సిబ్బందికి 8న రాజానగరం మండలం పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫెలిసిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది వినియోగించుకోవాలన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:36 AM