Share News

కూటమి గెలుపులో బీసీలు కీలకం

ABN , Publish Date - May 05 , 2024 | 12:11 AM

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపులో బీసీలు కీలకపాత్ర పోషిస్తారని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంగర రామ్మోనరావు అన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.

కూటమి గెలుపులో బీసీలు కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న అంగర రామ్మోహనరావు

  • కొవ్వూరులో జయహో బీసీ సమావేశం

కొవ్వూరు, మే 4: టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి గెలుపులో బీసీలు కీలకపాత్ర పోషిస్తారని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి అంగర రామ్మోనరావు అన్నారు. టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జయహో బీసీ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. కూటమి అధికారంలోకి వస్తే బీసీలకు స్వర్ణయుగమన్నారు. 1983 నుంచి బీసీలు టీడీపీకి అండగా నిలిచారన్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వస్తే బీసీలకు 1947లో ఎన్టీఆర్‌ తెలుగుదేవం పార్టీని స్థాపించిన తరువాత వచ్చిందన్నారు. ఆయన స్థానిక సంస్థల్లో 20శాతం రిజర్వేషన్‌ కల్పిస్తే చంద్రబాబు 33శాతానికి పెంచారన్నారు. జగన్మోహనరెడ్డి దానిని 24శాతానికి తగ్గించాడన్నారు. దీంతో బీసీలు 17 వేల ఉద్యోగాలు కోల్పోయారన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు గొర్రెల శ్రీధర్‌ మాట్లాడుతూ కూటమి అధికారంతోకి వస్తే బీసీలకు 34శాతం రిజర్వేషన్‌, బీసీ డిక్లరేషన్‌లో ప్రత్యేక రక్షణ చట్టం, రానున్న ఐదేళ్లలో బీసీల అభివృద్ధికి రూ.1.50 లక్షల కోట్లు, ఆదరణ పథకానికి ఏటా రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను మంజూరు చేస్తామన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఐదేళ్లుగా రాష్ట్రాన్ని జగన్‌రెడ్డి ఆరుగురు రెడ్లకు అప్పగించి దుర్గార్మపు పాలన కొనసాగించారన్నారు. ప్రశ్నించిన వారిపై అక్రమకేసులు పెట్టి దాడులు చేయించారన్నారు. రూ.100 బటన్‌ నొక్కుతూ రూ.1000 దోచుకున్నారన్నారు. మే 13న జరుగనున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావుకు సైకిల్‌ గుర్తుపై, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరికి కమలం గుర్తుపై ఓటువేసి గెలిపించాలన్నారు. ఈ సందర్భంగా బీసీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు అర్జిల్లి రామకృష్ణ అధ్యక్షతన రామ్మోహనరావును ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బీసీ సెల్‌ పట్టణాధ్యక్షుడు కాగిత రఘు, బీజేపీ ఓబీసీ సెల్‌ రాష్ట్రాధ్యక్షుడు రొంగళ గోపి శ్రీనివాస్‌, పిక్కినాగేంద్ర, రేకమండ రమేష్‌, కె.బాలకృష్ణ, తుంపల్లి ఆదినారాయణ, కె.సతీష్‌, రాజాన శ్రీనివాస్‌, రంభ హరిబాబు, పాకా జయరాం, మాదిరెడ్డి సతీష్‌, బర్ల శ్రీనివాస్‌, బొబ్బిలి పేర్రాజు పాల్గొన్నారు.

Updated Date - May 05 , 2024 | 12:11 AM