Share News

వానొచ్చింది!

ABN , Publish Date - May 03 , 2024 | 02:31 AM

జిల్లాలోని పలుప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిసాయి.వేసవితాపంతో అల్లాడిపోతున్న జనం వర్షం కురుస్తోందని ఆనందించేలోపు ఆగిపోవడంతో నీరసపడ్డారు.పెద్దవర్షం కాకపోవడంతో ఉక్కబోత మరింత పెరిగింది.

వానొచ్చింది!
తిరుపతిలో వర్షం

తిరుపతి అర్బన్‌/తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలుప్రాంతాల్లో గురువారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిసాయి.వేసవితాపంతో అల్లాడిపోతున్న జనం వర్షం కురుస్తోందని ఆనందించేలోపు ఆగిపోవడంతో నీరసపడ్డారు.పెద్దవర్షం కాకపోవడంతో ఉక్కబోత మరింత పెరిగింది. తిరుమలలో మాత్రం ఉరుములు, భారీ ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 నుంచి 3.30 గంటల వరకు భారీగా ఉరుములతో కూడిన వాన పడింది. వర్షం తర్వాత తిరుమల వాతావరణం చల్లబడింది. పాకాల మండలంలో గాలి వానతో పలు చోట్ల చెట్లకొమ్మలు విరిగిపోయాయి. ఐదు గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.రామచంద్రపురం మండలంలోని అనుపల్లి, వేపకుప్పం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటివర్షం కురిసింది. మామిడికాయలు నేలరాలాయి. ఎండ తీవ్రతకు అల్లాడుతున్న జనం కొంత ఉపశమనం పొందారు.

Updated Date - May 03 , 2024 | 02:32 AM