Share News

మూడురోజులపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ

ABN , Publish Date - May 05 , 2024 | 12:29 AM

నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 8 ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది

మూడురోజులపాటు పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ

తిరుపతి(కలెక్టరేట్‌), మే 4:నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 8 ఫెసిలిటేషన్‌ సెంటర్లలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ జరుగుతుంది.ఉదయం 9నుంచి సాయంత్రం 6గంటల లోపు ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల పరిధిలో 8 ఫెసిలిటేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు.గూడూరులో 3,210మంది, సూళ్ళూరుపేటలో 2,180మంది, వెంకటగిరిలో 2,771మంది, తిరుపతిలో 4,685మంది, శ్రీకాళహస్తిలో 3,021మంది, సత్యవేడులో 1,747మంది, చంద్రగిరిలో 4,685మంది ఓటర్లున్నారు.వీరిలో పీవో, ఏపీవో, పోలింగ్‌ విధుల్లో ఉన్నవారు 16,552మంది కాగా అత్యవసర విధుల్లో ఉన్నవారు 674మంది. హోం ఓటింగ్‌ ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోనున్న వారిలో వయోవృద్ధులు 613మంది, దివ్యాంగులు 526మంది వున్నారు. జిల్లాలో ఓటు వుండి ఇతర జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న వారు 3,789మంది వున్నారు. ఇతర జిల్లాల్లో ఓటు వుండి తిరుపతి జిల్లాలో విధుల్లో ఉన్న 5,351మంది తిరుపతి ఎస్వీ క్యాంపస్‌ హైస్కూల్లోని ఫెసిలిటేషన్‌ సెంట ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇంట్లోనే ఓటు వేయడానికి దరఖాస్తు చేసుకున్న 85ఏళ్లు దాటిన వృద్ధులకు, పోలింగ్‌ కేంద్రాలకు రాలేని దివ్యాంగులకు సోమవారం హోం ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగు సిబ్బంది ఓటర్ల ఇళ్ల వద్దకే వెళ్లి ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తారు.

Updated Date - May 05 , 2024 | 12:29 AM