Share News

సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

ABN , Publish Date - May 03 , 2024 | 02:32 AM

సకాలంలో వైద్యం అందక ఓ గర్భిణి మృతి చెందింది.

సకాలంలో వైద్యం అందక నిండు గర్భిణి మృతి

కేవీబీపురం, మే 2 : సకాలంలో వైద్యం అందక ఓ గర్భిణి మృతి చెందింది.మృతురాలి కుటుంబీకుల కథనం మేరకు....కేవీబీపురం మండలం రంగయ్యగుంట పంచాయతీ తిమ్మినాయుడుగుంట గిరిజన కాలనీకి చెల్లమ్మకు బుధవారం రాత్రి ప్రసవనొప్పులు ప్రారంభమయ్యాయి.ఏఎన్‌ఎం, ఆశా వర్కరు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లమన్నారు.అయితే అవకాశం లేక గురువారం ఉదయం తీసుకెళదామని కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున చెల్లమ్మకు నొప్పులు అధికం కావడంతో 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేశారు.అప్పటికి మరో పేషెంటును శ్రీకాళహస్తికి తీసుకెళ్లిన అంబులెన్స్‌ అక్కడినుంచి కాలనీకి చేరుకునేటప్పటికి సమయం పట్టింది.చెల్లమ్మను అంబులెన్స్‌లో ఎక్కించి కొద్దిదూరం తీసుకువచ్చేసరికి బీపీ బాగా తగ్గిపోయి చెల్లమ్మ అపస్మారక స్థితికి చేరుకుని కాసేపటికి మృతి చెందింది.అంబులెన్సు సిబ్బంది ఆమెకు ఎటువంటి వైద్యం అందించలేదని చెల్లమ్మ కుటుంబ సభ్యులు ఆరోపించారు.అంబులెన్సు సిబ్బంది మాత్రం తాము ఫోన్‌ వచ్చిన వెంటనే బయల్దేరి 37నిమిషాల్లో కాలనీకి చేరుకున్నామని, వాహనంలో కావాల్సిన పరికరాలున్నా చెల్లమ్మ పరిస్థితి అప్పటికే విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే మార్గమధ్యంలో మృతి చెందిందని తెలిపారు. ఆమెను తీసుకెళ్లి శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి అప్పగించగా వైద్యులు పరీక్షించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు తెలిపారు.

Updated Date - May 03 , 2024 | 07:55 AM