Share News

జగనను ఓడిస్తేనే పంచాయతీలకు నిధులు

ABN , Publish Date - May 04 , 2024 | 11:34 PM

జగనను ఇంటికి సాగనంపితేనే పంచాయతీ అభివృద్ధికి నిధులు వస్తా యని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు బాబూ రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

జగనను ఓడిస్తేనే పంచాయతీలకు నిధులు
మీడియాతో మాట్లాడుతున్న రాజేంద్రప్రసాద్‌

అనంతపురం అర్బన, మే 4: జగనను ఇంటికి సాగనంపితేనే పంచాయతీ అభివృద్ధికి నిధులు వస్తా యని ఏపీ పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ వ్యవస్థాపక అధ్యక్షు డు బాబూ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. గ్రామాలు బాగుండాలంటే.. ఎన్డీయే కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శ్రీనగర్‌ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన పాలనలో గ్రామీణాభివృద్ది కుంటుపడిందన్నారు. గ్రామాల అభివృద్ధికి జగనరెడ్డి నిధులు ఇవ్వకపోగా ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారన్నారు. ఇలాంటి వ్యక్తి మరో సారి సీఎం అయితే గ్రామాల పరిస్థితి మరింత అధ్వానంగా మారతాయన్నారు.


ఎన్డీయే కూటమి మేనిఫెస్టోలో గ్రామాలకు.... స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏం చేస్తామన్నది స్పష్టంగా చెప్పారన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడంతోపాటు వాటిపై స్థానిక ప్రజాప్రతినిధులకు పూర్తిగా హక్కు కల్పించడం జరుగుతుందన్నారు. కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డేగల కృష్ణమూర్తి, సర్పంచుల సంఘం ఉమ్మడి అనంత జిల్లా అధ్యక్షుడు గొనుగుంట్ల భూషణ, నాయకులు వేలూరి రంగయ్య, ఇస్మాయిల్‌, వీరేశ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 04 , 2024 | 11:34 PM