Share News

సీఎం ఓ గజదొంగ... వీరాంజనేయులు ఇసుక దొంగ

ABN , Publish Date - May 04 , 2024 | 11:30 PM

రాష్ట్ర సంపదను సీం జగన దోచేస్తుండగా... నియోజ కవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజినేయులు అక్రమంగా ఇసుక మాఫియా నడుపుతు న్నారని, వారిని చిత్తుగా ఓడించాలని నియోజ కవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు

సీఎం ఓ గజదొంగ... వీరాంజనేయులు ఇసుక దొంగ
శింగనమలలో ప్రచారం చేస్తున్న బండారు శ్రావణీశ్రీ, అంబికా లక్ష్మినారాయణ

బుక్కరాయసముద్రం, మే 4: రాష్ట్ర సంపదను సీం జగన దోచేస్తుండగా... నియోజ కవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజినేయులు అక్రమంగా ఇసుక మాఫియా నడుపుతు న్నారని, వారిని చిత్తుగా ఓడించాలని నియోజ కవర్గం టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ అన్నారు. శనివారం నియోజకవర్గం కేంద్రం లోని శింగనమల, వెస్ట్‌ నరసాపురం, నాగుల గుడ్డం తండా, మదిరేపల్లి, ఆకులేడు, లోలూరు గ్రామాల్లో ఆమె అనంతపురం ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మినారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇంటింటి ప్రచారం చేపట్టారు. ప్రతి గ్రామంలో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు అపూర్వ స్వాగతం పలికి... మహిళలు హరతలు పట్టి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండారు శ్రావణిశ్రీ మాట్లాడు తూ ... ఐదు సంవత్సరాలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి చేసింది ఏమీ లేదన్నా రు. శింగనమల చెరువు లోకల్‌జైషన చేసినట్లు ఉత్త పేపర్లు, ఉత్తితి జీవోలు తెచ్చి రైతులను నట్టేట మోసం చేశారన్నారు. ఎమ్మెల్యే భర్త ఆలూరు సాంబశివారెడ్డి ప్రస్తుత వైసీపీ అభ్యర్థి వీరాంజినేయులను బినామీ పెట్టుకుని కోట్లాది రూపాయులు దండుకున్నారన్నారు. ప్రస్తుతం ఇలాంటి బినామీ అభ్యర్థులకు ఓటు వేస్తే నియోజకవర్గంలోని ఇసుక, మట్టి, సహజ వనరులన్నీ దోచుకుంటారన్నారు. ఇసుక దొంగలకు ఓటు వేయద్దని టీడీపీని గెలిపిస్తే... నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్థి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర తెలుగుయువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, జిల్లా టీడీపీ ఉపాధ్యాక్షులు డేగల కృష్ణమూర్తి, కన్వీనర్‌ గుత్తా ఆదినారా యణ, మాజీ జెడ్పీటీసీ షాలినీ, మారుతీనాయుడు, అబ్దుల్‌ జిలానీ, వెంకటేష్‌, నాగముని, సత్తి, వెంకటనారాయణ, గంగాధర్‌, ఆది, కుళ్లాయప్ప పాల్గొన్నారు.


ఉద్యోగులూ ఆలోచించి ఓటేయ్యండి

ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించి ఓటేయ్యాలని ద్విసభ్యకమిటీ సభ్యులు ఆలంనరసానాయుడు , ముంటిమడుగు కేశవరెడ్డి సూచించారు. శనివారం బుక్కరాయసముద్రంలో జరుగు తున్న పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ పక్రియను పరిశీలించిన వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగనవాడీ, క్రాంటాక్టు ఉద్యోగు లకు మోస పూరిత వాగ్దానాలు ఇచ్చి జగన రెడ్డి... గత ఎన్నికలలో ఓట్లు వేయించుకు న్నాడ న్నారు. ఐదు సంవత్సరాలు ఉద్యోగులం దరినీ ఇబ్బందులు గురిచేయడంతో పాటు వారికి వేతనాలు, రావాల్సిన టీఎ, డీఎ, హెచఆర్‌ఎ తదితరులు ఇవ్వకుండా దగా చేశారన్నారు. సీపీఎస్‌ రద్దు పేరుతో మోసం చేశారన్నారు. వైసీపీకి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు.


నేడు ప్రచారం : బండారు శ్రావణిశ్రీ బుక్క రాయసముద్రం మండలంలోని రేగడికొత్తూరు, నీలంపల్లి, చెన్నంపల్లి, కేకే ఆగ్రహారం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నట్లు బీకేఎస్‌ మండల కన్వీనర్‌ అశోక్‌ తెలిపారు.


మరిన్ని వార్తల కోసం...

Updated Date - May 04 , 2024 | 11:31 PM