Share News

ISET : రేపే ఏపీ ఐసెట్‌

ABN , Publish Date - May 04 , 2024 | 11:45 PM

ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన ఎంట్రెన్స టెస్ట్‌ను (ఐసెట్‌-2024) సోమవారం నిర్వహిస్తామని సెట్‌ చైర్మన, ఎస్కేయూ వీసీ హుస్సునరెడ్డి శనివారం తెలిపారు. సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మురళీక్రిష్ణతో కలిసి ఐసెట్‌ నిర్వహణ గురించి ఎస్కేయూలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 27వరకు ఆనలైన ద్వారా ఐసెట్‌కు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి 48,828 ...

ISET : రేపే ఏపీ ఐసెట్‌
VC Hussena Reddy is speaking

అనంతపురం సెంట్రల్‌, మే 4: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్‌ కామన ఎంట్రెన్స టెస్ట్‌ను (ఐసెట్‌-2024) సోమవారం నిర్వహిస్తామని సెట్‌ చైర్మన, ఎస్కేయూ వీసీ హుస్సునరెడ్డి శనివారం తెలిపారు. సెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ మురళీక్రిష్ణతో కలిసి ఐసెట్‌ నిర్వహణ గురించి ఎస్కేయూలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 27వరకు ఆనలైన ద్వారా ఐసెట్‌కు దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఏపీ, తెలంగాణ నుంచి 48,828


మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 పట్టణాలతోపాటు హైదరాబాద్‌, సికింద్రబాద్‌తో కలిపి మొత్తం 113 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు సెషనలలో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షా సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, హాల్‌ టిక్కెట్‌ మినహా ఎలాంటి పరిపకరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమంతిచబోమని స్పష్టంచేశారు.

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 04 , 2024 | 11:45 PM