వీటి కోసం పర్సనల్ లోన్స్ జోలికి పోవద్దు

పర్సనల్ లోన్స్‌ను అనేక మంది ఉద్యోగులు తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు

బ్యాంకులు సహా ఇతర NBFCలు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో పూచీకత్తు లేకుండా రుణం ఇస్తాయి

మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ, శాలరీ వంటి పలు అంశాలు ప్రామాణికంగా తీసుకుని రుణాన్ని అందిస్తాయి

కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు

పలు బ్యాంకులు పర్సనల్ లోన్‌లపై అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయని అంటున్నారు

లోన్ తీసుకునే ముందు చెప్పిన వడ్డీ రేటు, లోన్ తీసుకున్న తర్వాత ఉందో చూసుకోవాలని సూచిస్తున్నారు

అంతేకాదు లోన్స్ తీసుకుని షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు చేయోద్దని  సూచనలిస్తున్నారు

ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాల్సి వచ్చినప్పుడు కూడా లోన్స్ తీసుకోవద్దని అన్నారు

రుణాన్ని తిరిగి చెల్లించవలసి వస్తే ఆ రుణాన్ని తిరిగి చెల్లించడానికి మరొక లోన్ తీసుకోవద్దని కోరారు

లాటరీ, జూదం, ఇతర పెట్టుబడుల కోసం కూడా లోన్స్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు