'దేశంలో నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి'

భారత్‌లో ప్రభుత్వాలు నిరుద్యోగ సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టాలని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నప్పటికీ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు లభించడం లేదన్నారు

ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతుందన్నారు

1.4 బిలియన్ల బలమైన భారత జనాభాకు, ఉద్యోగాల కల్పన ప్రస్తుతం ఆందోళనకరంగా మారిందన్నారు

ఓ సర్వే ప్రకారం 27 శాతం మంది ఓటర్లలో నిరుద్యోగం ప్రధాన ఆందోళనగా ఉందని వెల్లడి

2014లో నిరుద్యోగిత రేటు 4.9 శాతంగా ఉండగా, అది 2023 నాటికి 5.4 శాతానికి పెరిగింది

మరో నివేదిక ప్రకారం ఫిబ్రవరి 2024కి ఇది 8 శాతానికి పైగా ఉందని అంచనా 

సేవలు, తయారీ, వ్యవసాయ రంగాల్లో ఉపాధి అవకాశాలను పెంచాలని రఘురామ్ రాజన్ సూచన

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగం ప్రధాన సమస్యగా మారిపోయిందన్న రఘురామ్ రాజన్