ఇంటి కొనుగోలుకై లోన్ తీసుకుంటున్నారా..ఇవి తప్పక తెలుసుకోండి

ప్రతీ ఒక్కరూ సొంతిల్లు కొనుగోలు చేయాలని భావిస్తారు, దీనికి గృహ రుణం చక్కని మార్గమని చెప్పవచ్చు

అయితే లోన్ తీసుకునే విషయంలో కొన్ని విషయాలను పాటించడం ద్వారా మీరు తక్కువ వడ్డీకే లోన్ పొందవచ్చు

రుణ గ్రహీత సిబిల్‌ స్కోర్‌, ఆదాయం, వేతనం, రుణ చరిత్ర వంటి అంశాలు హోమ్‌ లోన్‌ విషయంలో కీలకంగా ఉంటాయి

సిబిల్‌ స్కోర్‌ ఆధారంగా రుణాలపై వడ్డీరేట్లు ఉంటాయి, స్కోర్‌ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీరేటుకే లోన్‌ పొందవచ్చు

మనకు తెలియని చార్జీలు (హిడెన్‌ చార్జెస్‌) ఉంటాయి. కాబట్టి గృహ రుణం విషయంలో తొందరపాటు ఉండొద్దు

రుణం తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించాలి

3 నెలలకు మించి రుణ గ్రహీత వాయిదాలు చెల్లించనట్టెతే సర్ఫేసీ చట్టం ప్రకారం కోర్టులతో పనిలేకుండా బ్యాంకులు చర్యలు తీసుకుంటాయి

మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకుంటే మీరు రుణం తీసుకున్న సంస్థకు ఆ విషయాన్ని ముందే తెలియజేయాలి

దీనివల్ల మీకు కొంత వెసులుబాటు దక్కే అవకాశం ఉంటుంది

కో ఓనర్‌గా మహిళలుంటే ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ద్వారా వడ్డీ రాయితీ, ఇతరత్రా సబ్సిడీలు పొందవచ్చు

ప్రాపర్టీకి సంబంధించి అన్నీ లీగల్‌గా ఉండేలా చూసుకోవడం మంచిది

ఎన్‌వోసీలు, ట్యాక్స్‌ క్లియరెన్సులు తప్పనిసరి. గ్యారంటీయర్‌ కూడా అవసరం

లోన్‌ ఇన్సూరెన్స్‌ ఎంతో ముఖ్యం. మీ రుణదాతతో ఈ విషయంపై ఆరా తీసి వివరాలు తెలుసుకోవాలి

ఐటీ చట్టం 1961 సెక్షన్‌ 80సీ, 24(బీ), 80ఈఈఏ కింద గృహ రుణం అసలు, వడ్డీ చెల్లింపులపై రుణ గ్రహీతలు పన్ను మినహాయింపులు పొందవచ్చు