Share News

Offer: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల భారీ తగ్గింపు

ABN , Publish Date - Apr 30 , 2024 | 07:44 AM

మీరు మంచి స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ధరల్లో కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మే 3 నుంచి మొదలు కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు.

Offer: అదిరిపోయే ఆఫర్.. శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.20 వేల భారీ తగ్గింపు
Huge discount of Rs 20000 on Samsung galaxy s23 smartphone

మీరు మంచి స్మార్ట్‌ఫోన్(smart phone) డిస్కౌంట్ ధరల్లో కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు శుభవార్త. ఎందుకంటే మే 3 నుంచి మొదలు కానున్న ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా Samsung Galaxy S23పై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఫోన్ ధర 64,999గా ఉంది. కానీ Samsung Galaxy S23 కేవలం రూ. 44,999కి అందుబాటులో ఉంటుందని Flipkart తెలిపింది.

ఏకంగా దాదాపు 20 వేల రూపాయల తగ్గింపు ప్రకటించారు. అయితే ఈ డీల్ పూర్తి వివరాలు ఇంకా ప్రకటించలేదు. కానీ అన్ని ఆఫర్‌లతో కూడిన Samsung Galaxy S23 బేస్ వేరియంట్ ధరతో పోలిస్తే ఇది భారీ తగ్గింపు అని చెప్పవచ్చు. Samsung Galaxy S23 5G గత సంవత్సరం ప్రారంభించబడింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి ఇప్పుడు చుద్దాం.


Galaxy S23 6.1 అంగుళాల HD ప్లస్ ఇన్ఫినిటీ AMOLED డిస్‌ప్లే కలిగి ఉంది. ఇది (1080×2340 పిక్సెల్స్) రిజల్యూషన్, 425 ppi, 20:9 యాస్పెక్ట్ రేషియోతో వస్తుంది. Galaxy S23 50 MP ప్రైమరీ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా, HDR టెక్నాలజీతో కూడిన 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సినిమాటిక్ విగ్నేట్ వీడియోలను క్యాప్చర్ చేయడానికి ట్రాన్స్‌ఫార్మేటివ్ AIని కూడా కలిగి ఉంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌, 8 GB RAM, 128 GB ROM వంటి ఫీచర్లతో లభిస్తుంది.


ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే 5G, 4G LTE, Wi-Fi 6e, బ్లూటూత్ 5.3, Wi-Fi డైరెక్ట్, USB టైప్ సీ పోర్ట్ సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా ఈ ఫోన్ IP68-రేటెడ్. Samsung నాక్స్ సెక్యూరిటీ, కంపెనీ నాక్స్ వాల్ట్‌కు సపోర్టును కూడా కలిగి ఉంది. Galaxy S23 3,900mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 30 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో బ్యాటరీని 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని Samsung పేర్కొంది. ఇది కాకుండా వైర్‌లెస్ పవర్‌షేర్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఫాంటమ్ బ్లాక్, క్రీమ్, గ్రీన్, లావెండర్ రంగుల్లో లభిస్తుంది.


ఇది కూడా చదవండి:

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 30 , 2024 | 07:47 AM