Share News

IPL 2024: నేడు SRH vs RR కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే

ABN , Publish Date - May 02 , 2024 | 09:21 AM

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.

IPL 2024: నేడు SRH vs RR కీలక మ్యాచ్.. ఎవరు గెలిచే ఛాన్స్ ఉందంటే
ipl 2024 SRH vs RR 50th Match Win Prediction

ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.

ఈ పరాజయాల తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ 4 నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు పది పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు రంగంలోకి దిగనుంది. రాజస్థాన్ రాయల్స్ తొమ్మిది మ్యాచ్‌ల్లో ఎనిమిది విజయాలతో 16 పాయింట్లను కలిగి ఉంది. ఈ మ్యాచులో కూడా విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌లో స్థానం ఖాయం అవుతుంది.


హెడ్ టు హెడ్

సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH), రాజస్థాన్ రాయల్స్(RR) జట్ల మధ్య గతంలో 18 ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఇరు జట్లు చెరో తొమ్మిది మ్యాచ్‌లు గెలిచాయి. రాజస్థాన్‌పై హైదరాబాద్‌ అత్యధిక స్కోరు 217. కాగా సన్‌రైజర్స్‌పై రాయల్స్ అత్యధిక స్కోరు 220. ఇక గూగుల్ గెలుపు అంచనా(google win probability) ప్రకారం చూస్తే ఈ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ జట్టు 51 శాతం గెలిచే అవకాశం ఉండగా, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు 49 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది.


సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు ప్రాబబుల్ 11లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), నితీష్ రెడ్డి, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, T నటరాజన్ ఉన్నారు.

రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు ప్రాబబుల్ 11లో యశస్వి జైస్వాల్, జోష్ బట్లర్, సంజు శాంసన్ (C/WK), ర్యాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్ కలరు.


ఇది కూడా చదవండి:

చెన్నైపై పంజా


హోరాహోరీకి ఉప్పల్‌ సిద్ధం


Read Latest Sports News and Telugu News

Updated Date - May 02 , 2024 | 09:26 AM