Share News

Manage Your Anxiety : ఒత్తిడి తగ్గాలంటే ఈ అలవాట్లకు చెక్ పెట్టాల్సిందే..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 04:20 PM

రోజువారి పనులలో ఆందోళనను తగ్గించే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరక శ్రేయస్సుకు వ్యాయామం ఉత్తమం.

Manage Your Anxiety : ఒత్తిడి తగ్గాలంటే ఈ అలవాట్లకు చెక్ పెట్టాల్సిందే..!
Anxiety

ఈ మధ్యకాలంలో అందరిలోనూ మానసికమైన ఒత్తిడి, ఆందోళన లక్షణాలు ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి ప్రధానమైన కారణం జీవన శైలి మార్పులు, చేసే వృత్తి, ఉద్యోగాలలో కూడా తీవ్రమైన ఒత్తిడి లక్షణాలను కలిగి ఉండటం ప్రధాన కారణాలు. రోడువారీ అలవాట్లను కంట్రోల్ చేసుకోకపోవడం కూడా ఆందోళన చెందాల్సిన విషయాలే. మెరుగైన మానసిక శ్రేయస్సుకోసం ప్రతి ఒక్కరూ ఒత్తిడిని అధిగమించాలంటే మాత్రం జీవన శైలిలో మార్పులు తప్పనిసరి. అవేమిటంటే.

ఒత్తిడి కారణంగా..మార్చుకోవాల్సిన అలవాట్లు..

మానసికమైన ఆరోగ్యం కోసం, ఒత్తిడిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి.

కెఫిన్ తీసుకోవడం..

ఉదయంపూట కాఫీ అందరికీ అలవాటుగానే ఉంటుంది. ఇందులోని కెఫిన్ ఆందోళన, ఒత్తిడిని పెంచేస్తుంది. గుండె దడను పెంచుతుంది. కనుక కాఫీని వదిలేయడం మంచిది.

ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!


వ్యాయామం..

రోజువారి పనులలో ఆందోళనను తగ్గించే విధంగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరక శ్రేయస్సుకు వ్యాయామం ఉత్తమం.

స్క్రీన్ టైం..

రోజువారీ పనులలో భాగం అయిపోయిన షోషల్ మీడియా ప్రభావం నుంచి బయటకు రావాలి. ఇది తెలియకుండానే ఒత్తిడిని పెంచుతుంది. ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. కనుక స్క్రీన్ టైం తగ్గించుకోవడం మంచిది.

Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!

మధ్యపానం..

ఈ మధ్యకాలంలో సాధారణ అలవాటుగా మారిపోతున్న మధ్యపానాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఇది ఒత్తిడిని పెంచుతుంది. మెదడు పనితీరుపై ప్రభావాన్ని చూపుతుంది.

ప్యాక్డ్ ఫుడ్..

నిల్వ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం, ఫ్యాకింగ్ ఫుడ్స్ తీసుకోవడం వంటివి కూడా ఆరోగ్యానికి చేటును తెస్తాయి. ఇవి చక్కెర స్థాయిలను పెంచుతాయి. కనుక వీటికి దూరంగా ఉండాలి. సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోవడం వంటి అలవాట్లను అలవర్చుకోవడం మంచిది.


Health Tips : రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!

హైడ్రేషన్ స్థాయిలు..

శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీటిని సరైన సమయంలో తీసుకుంటూ ఉండాలి. ఇది శరీరం ఒత్తిడికి గురికాకుండా చేస్తుంది.

వృత్తి పరమైన టెంక్షన్స్..

ఉరుకుల పరుగుల జీవితం నుంచి ఆడవిడుపు అవసరం. కాస్త సమయం దొరికినా ఒత్తిడిని దూరం ఉంచేందుకు చేయాల్సిన పనులు మానసిక ఆరోగ్యాన్ని పెంచేవిధంగా ఉండాలి. మంచి సంగీతాన్ని వినడం, ప్రకృతిలో సమయాన్ని గడపడం, పుస్తక పఠనం, నచ్చిన వ్యాపకాలతో గడపడం వంటివి ఒత్తిడిని, ఆందోళనను దూరం చేస్తాయి.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 30 , 2024 | 04:21 PM