Share News

Health Tips : రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!

ABN , Publish Date - Apr 30 , 2024 | 03:37 PM

ఎండు ద్రాక్షను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. ఇది డిటాక్స్ వాటర్ గా చక్కగా పనిచేస్తుంది. కాలేయం ఆరోగ్యానికి మంచిది. రాత్రి పూట ఎండుద్రాక్షను నానబెట్టి, పిసికి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల రక్త శుద్ధి కలుగుతుంది.

Health Tips : రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..!
Energy Booster

మనం తీసుకునే ఫుడ్ విషయంలో ఆరోగ్యానికి బలాన్నిచ్చేవిగా ఉండే విధంగానే చూసుకుంటాం. ఈ మధ్యకాలంలో వస్తున్న ఆరోగ్యసమస్యల కారణంగా ఎంత బలమైన ఆహారాన్ని తీసుకుంటున్నామనే అంచనాల మధ్య ఆహారాన్ని ఎంచుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ కారణంగా ఆరోగ్యాన్ని, పోషకాలను పొందవచ్చు. ఇవి కడుపు నిండుగా ఉండే ఫీలింగ్ ను ఇస్తాయి. ఆకలిని మందగించేలా చేస్తాయ. ఆయుర్వేదం ప్రకారం పరగడుపున ఏది తీసుకున్నా అది శరీరానికి మంచి చేస్తుందనే విషయంలో ఉదయాన్నే ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.

ఖాళీ కడుపుతో కనక ఎండుద్రాక్షను తీసుకుంటే..

ఎండు ద్రాక్షను నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఆరోగ్యం సొంతం అవుతుంది. ఇది డిటాక్స్ వాటర్ గా చక్కగా పనిచేస్తుంది. కాలేయం ఆరోగ్యానికి మంచిది. రాత్రి పూట ఎండుద్రాక్షను నానబెట్టి, పిసికి ఆ నీటిని ఉదయాన్నే తాగడం వల్ల రక్త శుద్ధి కలుగుతుంది. శరీరంలో అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఎండుద్రాక్షలో ఫైబర్ కంటెంట్ కారణంగా కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది.

పొట్ట ఆరోగ్యం..

ద్రాక్షలో ఉన్న పీచు, సహజ ద్రవాల కారణంగా జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇందులో టార్టారిక్ యాసిడ్, టానిన్లు, కాటెచిన్స్ వంటి పోషకాలున్నాయి. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది.


Health Tips : షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన వేసవి పానీయాలు ఇవే..!

అసిడోసిస్ సమస్య తగ్గిస్తుంది.

అసిడోసిస్ అనేది రక్తంలో ఆమ్లత్వం పెరగడం కారణంగా శ్వాస తీసుకోడంలో ఏర్పడే సమస్య. ఇది నల్ల ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల యాంటాసిడ్లు, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి కడుపులో ఆమ్లాలను నియంత్రించడంలో సహాయపడతాయి.

రక్తహీనతతో పోరాడుతుంది.

ఐరన్, బి-కాంప్లెక్స్ విటమిన్లు, కాపర్ అన్నీ ఎండుద్రాక్షలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన పేగు, గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.కాస్త నీరసంగా ఉన్నా ఎండుద్రాక్ష నీటిని తీసుకుంటే చాలు శక్తి తిరిగి పుంజుకుంటుంది.


ఈ చిట్కాలతో రాత్రిపూట మంచి నిద్ర ఖాయం.. ట్రై చేసి చూడండి..!

నోటి ఆరోగ్యానికి కూడా..

ఉదయాన్నే నానబెట్టిన ఎండుద్రాక్షను తీసుకోవడం వల్ల దంత ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఎండుద్రాక్ష నీటిలో ఫైటోకెమికల్స్, ఒలియానోలిన్ యాసిడ్లు ఉంటాయి. ఇవి దంతాలకు హాని కలిగించే సూక్ష జీవులను తరిమికొడతాయి.

రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం..

ఎండుద్రాక్షలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Read Latest Navya News and Thelugu News

గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.

Updated Date - Apr 30 , 2024 | 03:37 PM