Share News

Healthy Foods: ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బద్దకంగా అనిపిస్తుంటుందా? ఈ స్నాక్స్ తిన్నారంటే హుషారుగా మారిపోతారు..!

ABN , Publish Date - May 01 , 2024 | 04:39 PM

రోజులో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే విధమైన శక్తితో పనిచేసేవారు కూడా ఉండరు. మొదట్లో పనిచేసినంత చురుగ్గా ఆ తరువాత ఉండదు. పని వేగం కూడా మెల్లగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. శక్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి.

Healthy Foods: ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు బద్దకంగా అనిపిస్తుంటుందా? ఈ స్నాక్స్ తిన్నారంటే హుషారుగా మారిపోతారు..!

రోజూ ఒకే వేగంతో పని చేయగల వారు ఎవరూ ఉండరు. అదేవిధంగా రోజులో ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకే విధమైన శక్తితో పనిచేసేవారు కూడా ఉండరు. మొదట్లో పనిచేసినంత చురుగ్గా ఆ తరువాత ఉండదు. పని వేగం కూడా మెల్లగా తగ్గిపోతుంది. శరీరంలో శక్తి తక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. శక్తి తక్కువగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు సరిగ్గా తినకపోవడం వల్ల మరికొన్నిసార్లు ఆపకుండా ఎక్కువసేపు పనిచేయడం వల్ల అలసట ఎక్కువ ఉంటుంది. ఈ అలసటను పోగొట్టే స్నాక్స్ తినడం ద్వారా తిరిగి ఉత్సహాంగా పనిచేయగలగుతారు. శరీరానికి శక్తిని అందించే ఆ స్నాక్స్ ఏంటో తెలుసుకుంటే..

అరటిపండు

అరటిపండులో అధిక మొత్తంలో గ్లూకోజ్ ఉంటుంది, ఇది శరీరంలో శక్తిని పెంచుతుంది. ఏకాగ్రతతో పనిచేయడానికి సహాయపడుతుంది. కేవలం ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి రోజంతా సరిపడా గ్లూకోజ్ అందుతుంది.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!


డ్రై ఫ్రూట్స్, నట్స్..

బాదం, వాల్‌నట్ వంటి డ్రై ఫ్రూట్స్ శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు కూడా శరీరానికి శక్తిని అందిస్తాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవడం వల్ల శరీరానికి నాణ్యమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్‌ని అందుతాయి. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది.

మఖానా ..

మఖానాలో మంచి కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి, సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వీటిని తినవచ్చు. గుండె సమస్యలతో బాధపడేవారికి కూడా మఖానా ఉపయోగకరంగా ఉంటుంది. శరీరానికి శక్తి అందించడమే కాకుండా , బరువు తగ్గడంలో కూడా మఖానా సహాయపడుతుంది.

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!


వేయించిన శనగలు..

పని మధ్యలో బద్దకంగా అనిపిస్తే వేయించిన శనగలు ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. వేయించిన శనగలలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ప్రయోజనకరమైన ఖనిజాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

గ్రీన్ టీ

పని మధ్యలో బద్దకంగా అనిపిస్తే గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ కాఫీ కంటే మెరుగైనది. ఇది మెదడును అప్రమత్తంగా ఉంచే శరీరానికి ప్రయోజనకరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది.

యాపిల్

అలసిపోయిన శరీరానికి తక్షణ శక్తి అందించడానికి అరటిపండుతో పాటు యాపిల్ కూడా మంచిది. యాపిల్స్‌లో మంచి మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తక్కువ చక్కెర ఉంటుంది. యాపిల్ శరీరానికి శక్తిని, ప్రొటీన్లను అందించడంలో మెరుగ్గా ఉంటుంది.

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 01 , 2024 | 04:39 PM