Share News

Health Tips: జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ రెండు పనులు చెయ్యండి చాలు..!

ABN , Publish Date - May 01 , 2024 | 12:52 PM

జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. అయితే కేవలం రెండు పనులు చేయడం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉండచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Health Tips: జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? ఈ రెండు పనులు చెయ్యండి చాలు..!

మనిషి జీవితంలో ఎంత సాధించినా ఆరోగ్యంగా లేకపోతే వృథా.. కొందరు తిండి, నిద్రను సైతం పక్కనపెట్టి అహర్నిశలూ శ్రమించి సంపాదిస్తుంటారు. ఆ తరువాత ఆరోగ్య సమస్యలతో వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ రానురాను ప్రజలకు ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతోంది. జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం కోసం ఎన్నో ఆరోగ్య చిట్కాలు పాటిస్తున్నారు. అయితే కేవలం రెండు పనులు చేయడం ద్వారా జీవితాంతం ఆరోగ్యంగా ఉండచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో వాటి వల్ల ఆరోగ్యం ఎందుకు బాగుంటుందో తెలుసుకుంటే..

రోజూ నాలుగు గంటల శారీరక శ్రమ..

రోజూ నాలుగు గంటల శారీరక శ్రమ చెయ్యడం వల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం వీలవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఇది బరువు నియంత్రకు చక్కని మార్గం. అయితే ఈ నాలుగు గంటల్లో సాధారణ పనులే కాదు.. శరీరానికి మంచి శ్రమ కలిగించే వ్యాయామాలు, చురుకైన నడక, జిమ్ వర్కౌట్ వంటివి కూడా ఉండాలి.

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!


రోజూ ఎనిమిది గంటల నిద్ర..

రోజూ ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల జీవితాంతం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల రోజులో చేసే నాలుగు గంటల శారీరక శ్రమ వల్ల అలసిపోయిన శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది. ఆరోగ్య నిపుణులు చెబుతున్న మరొక విషయం ఏమంటే.. రోజూ 8 గంటలు నిద్రపోవాలనే నియమం కోసం వ్యాయామాన్ని స్కిప్ చేయకూడదు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మానసికంగా బలంగా ఉన్నవారిలో ఉండే 8 లక్షణాలు ఇవీ..!

30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 01 , 2024 | 12:52 PM