Share News

Hyderabad: బీరువాలో దాచిన రూ.70 లక్షల బంగారం, వజ్రాభరణాలు చోరీ

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:57 AM

అలమారాలో దాచి ఉంచిన రూ.70 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు కనిపించలేదు. ఇదే అలమారాలో ఉన్న మరో రూ.40 లక్షల ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు.62(Jubilee Hills Road No.62)లో నివాసముండే డీవీఎస్‌ సోమరాజు వ్యాపారి. తల్లి, తండ్రి, భార్య, కుమారులతో కలిసి ఉంటున్నాడు.

Hyderabad: బీరువాలో దాచిన రూ.70 లక్షల బంగారం, వజ్రాభరణాలు చోరీ

హైదరాబాద్: అలమారాలో దాచి ఉంచిన రూ.70 లక్షల విలువ చేసే బంగారం, వజ్రాభరణాలు(Gold and diamond jewellery) కనిపించలేదు. ఇదే అలమారాలో ఉన్న మరో రూ.40 లక్షల ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబరు.62(Jubilee Hills Road No.62)లో నివాసముండే డీవీఎస్‌ సోమరాజు వ్యాపారి. తల్లి, తండ్రి, భార్య, కుమారులతో కలిసి ఉంటున్నాడు. ఈ నెల 4న కుటుంబ సభ్యులు అంతా కలిసి ఓ శుభకార్యానికి వెళ్లి వచ్చారు. వజ్రాల నెక్లెస్‌, 70 గ్రాముల చంద్రహారాలు, 50 గ్రాముల రెండు గొలుసులు, వందగ్రాముల బంగారు గాజులు, 185 గ్రాముల బంగారు బిళ్లలను అలమారాలో భద్రపరిచారు.

ఇదికూడా చదవండి: Hyderabad: రా.. రమ్మంటున్న రైల్‌ మ్యూజియం.. నేడు ప్రపంచ వారసత్వ దినోత్సవంగా ఉచిత ప్రవేశం

ఈ నెల 15న ఆభరణాలు తీసేందుకు అలమారా తీయగా అందులో నగలు కనిపించలేదు. ఇదే అలమారాలో మరో సొరుగులో ఉన్న రూ.40 లక్షల విలువ చేసే ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. తమ ఇంట్లో అలమారాలో దాచిన 70 లక్షల విలువ చేసే ఆభరణాలు కనిపించడం లేదని బాధితులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Parliament Elections: బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు

Updated Date - Apr 18 , 2024 | 09:57 AM