Share News

Priyamvada Natarajan: ఒకప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థి.. ఇప్పుడు టైం మ్యాగజైన్‌లో చోటు, ఇంతకీ ఎవరంటే

ABN , Publish Date - Apr 18 , 2024 | 04:56 PM

ఒకప్పుడు ఢిల్లీలోని ప్రముఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రముఖ టైం మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పెరుగుతాయి, అవి పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై కూడా దృష్టి సారించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

Priyamvada Natarajan: ఒకప్పుడు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యార్థి.. ఇప్పుడు టైం మ్యాగజైన్‌లో చోటు, ఇంతకీ ఎవరంటే
Priyamvada Natarajan

ఒకప్పుడు ఢిల్లీలోని ప్రముఖ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (DPS) నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఇప్పుడు ప్రముఖ టైం మ్యాగజైన్‌లో చోటు దక్కించుకున్నారు. అంతేకాదు బ్లాక్ హోల్స్ ఎలా ఏర్పడతాయి, అవి ఎలా పెరుగుతాయి, అవి పరిసరాలను ఎలా ప్రభావితం చేస్తాయనే అంశాలపై కూడా దృష్టి సారించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమెనే తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ప్రియంవదా నటరాజన్(Priyamvada Natarajan). పుట్టి పెరిగింది ఇక్కడే అయినా, పై చదువుల కోసం విదేశాలకు(NRI) వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.


ప్రియంవదా 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) నుంచి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. తర్వాత MIT సైన్స్, టెక్నాలజీ, సొసైటీ ప్రోగ్రామ్‌లో సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. ఆ తర్వాత నటరాజన్ 1999లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రానమీ నుంచి PhDని పూర్తి చేశారు. ఆ క్రమంలోనే ఆమె ప్రతిష్టాత్మక ఐజాక్ న్యూటన్ స్కాలర్‌షిప్‌ను అందుకున్నారు.

ఈ ఫెలోషిప్ పొందిన మొదటి మహిళ ఈమెనే కావడం విశేషం. నటరాజన్ ఎక్కువగా బ్లాక్ హోల్స్ పై పరిశోధనలు చేయగా, 2022లో లిబర్టీ సైన్స్ సెంటర్ జీనియస్ అవార్డును కూడా గెల్చుకున్నారు. దీంతోపాటు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్‌సైన్సైస్ సహా పలు ఫెలోషిప్‌లు అందుకున్నారు.


ప్రియంవదా నటరాజన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, యేల్ విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్ర ప్రొఫెసర్. ఈమె ఖగోళ శాస్త్ర విభాగానికి అధ్యక్షురాలు, మహిళా ఫ్యాకల్టీ ఫోరమ్ ఛైర్‌పర్సన్ కూడా. అదనంగా నటరాజన్ యేల్‌లోని సైన్స్, హ్యుమానిటీస్‌లో యేల్ ఫ్లాగ్‌షిప్ ఇంటర్ డిసిప్లినరీ ఫ్రాంకే ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యాగజైన్ 'టైమ్' 2024 సంవత్సరంలో 100 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో సమాజంలోని వివిధ రంగాలలో పనిచేస్తున్న అనేక మంది భారతీయ వ్యక్తులకు స్థానం కల్పించింది.

వారిలో భారతీయ సంతతికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రియంవదా నటరాజన్ కూడా చోటు దక్కించుకున్నారు. ప్రియంవదాతో పాటు ఈ జాబితాలో వ్యాపార వేత్తలు, కళాకారులు, నటులు, క్రీడాకారులు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఇతర రాజకీయ నాయకులకు కూడా చోటు దక్కింది.


ఇది కూడా చదవండి:

SIP: ప్రతి రోజు రూ.110 ఇన్‌వెస్ట్ చేయండి.. కోటీశ్వరులుగా మారండి

Business Idea: ఉద్యోగానికి బై చెప్పేసి రూ.50,000తో వ్యాపారం.. ఇప్పుడు నెలకు లక్షల్లో ఆదాయం!


మరిన్ని బిజినెస్ వార్తల కోసం

Updated Date - Apr 18 , 2024 | 05:04 PM