Share News

AP Elections 2024:ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే భారీ విజయం: కేశినేని చిన్ని

ABN , Publish Date - May 01 , 2024 | 08:36 PM

ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎన్డీయే కూటమి అభ్యర్థులు కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) జోస్యం చెప్పారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు.

AP Elections 2024:ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిదే భారీ విజయం: కేశినేని చిన్ని
Kesineni Chinni

ఎన్టీఆర్ జిల్లా: ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధిస్తుందని ఎన్డీయే కూటమి అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) (Kesineni Chinni) జోస్యం చెప్పారు. విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. ర్యాలీగా వచ్చిన కేశినేని చిన్నిని గజమాలతో టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. గ్రామంలోని శ్రీ మారెమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ గ్రామం టీడీపీకి కంచుకోటని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని కోరారు.


పుట్రెలలో జనవాహిని చూస్తుంటే.. ఎన్డీయే కూటమి భారీ విజయంతో గెలిచి విజయోత్సవ ర్యాలీని తలపించేలా ఉందని తెలిపారు.ఎన్నికలకు ఇంకా పది రోజులే సమయం ఉందని.. ఎన్డీఏ కూటమి విజయం కోసం కష్టపడి పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మన కలల రాజధాని అమరావతిని తెచ్చుకుందామని, పిల్లలు భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధిని సంక్షేమ పథంలో నడిపిద్దామని కేశినేని చిన్ని పేర్కొన్నారు.

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest AP News And Telugu News

Updated Date - May 01 , 2024 | 09:30 PM